Rahul Gandhi: మహిళా బిల్లు వెనుక ఉన్న కుట్రను బద్దలు కొట్టాం.. తమిళనాడులో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం
- మహిళా బిల్లు వెనుక ఉన్న కుట్రను బద్దలు కొట్టాం
- దేశ స్వరూపాన్ని మోడీ మార్చాలనుకున్నారు
- తమిళనాడులో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం
- రేపటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్‌లో ప్రధాని మోడీ చాలా ప్రమాదకరమైన పని చేశారని కాంగ్రెస్ అగ్ర నేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో భాగంగా కన్యాకుమారిలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ప్రధాని మోడీ మహిళా బిల్లును ఆమోదిస్తున్నట్లుగా దేశానికి చెప్పారని.. కానీ అసలు ప్రణాళిక మాత్రం భారతదేశ ఎన్నికల స్వరూపాన్ని మార్చడమేనని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు వెనుక ఉన్న ఉద్దేశం.. డీలిమిటేషన్ ద్వారా భారతదేశ నియోజకవర్గాలను మార్చడమే అన్నారు. దక్షణాది రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాల సీట్ల సంఖ్యను తగ్గించి.. అనుకూలమైన రాష్ట్రాల సంఖ్యను పెంచుకోవడమే డీలిమిటేషన్ ఉద్దేశం అని పేర్కొన్నారు. అధికార పార్టీ కుట్రలను విపక్షాలు తిప్పికొట్టాయన్నారు.
ఇది కూడా చదవండి: Supreme Court: నేతాజీని జాతీయ పుత్రుడిగా ప్రకటించలేం.. తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు
Also Read
- Jantar Mantar Protest: జంతర్ మంతర్ వద్ద మరో నిరసన.. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేలాది మంది..
- Drugs Control Department: “UP TO 60%/70%/80% DISCOUNT” బోర్డులు.. ఫార్మసీలకు డ్రగ్స్ కంట్రోల్ సీరియస్ వార్నింగ్
- Rahul Gandhi: పెల్లెట్ గన్ ఘటనపై రాహుల్ గాంధీ ధర్నా.. ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదు
- Maharashtra: కొడుకును కాపాడే ప్రయత్నం విషాదాంతం.. తల్లిదండ్రులు సహా ముగ్గురూ మృతి
తమిళనాడులో ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుంది. రేపటితో ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇదిలా ఉంటే ఇటీవల ఏప్రిల్ 16 నుంచి 18 వరకు కేంద్రం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించింది. మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టింది. అయితే ఓటింగ్ సమయంలో బిల్లులు వీగిపోయాయి.
#WATCH | Kanniyakumari, Tamil Nadu: Lok Sabha LoP and Congress MP Rahul Gandhi says, "A few days ago in parliament, the Prime Minister did a very dangerous thing. He told the country that he wanted to pass a women's bill, but the real plan was to change the electoral structure of… pic.twitter.com/M8JoKeBgaf
— ANI (@ANI) April 20, 2026
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్‌ఫర్డ్‌కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్‌లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!