Rahul Gandhi: మహిళా బిల్లు వెనుక ఉన్న కుట్రను బద్దలు కొట్టాం.. తమిళనాడులో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం

  • మహిళా బిల్లు వెనుక ఉన్న కుట్రను బద్దలు కొట్టాం
  • దేశ స్వరూపాన్ని మోడీ మార్చాలనుకున్నారు
  • తమిళనాడులో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం
  • రేపటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం
Rahul Gandhi

Rahul Gandhi

పార్లమెంట్‌లో ప్రధాని మోడీ చాలా ప్రమాదకరమైన పని చేశారని కాంగ్రెస్ అగ్ర నేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో భాగంగా కన్యాకుమారిలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ప్రధాని మోడీ మహిళా బిల్లును ఆమోదిస్తున్నట్లుగా దేశానికి చెప్పారని.. కానీ అసలు ప్రణాళిక మాత్రం భారతదేశ ఎన్నికల స్వరూపాన్ని మార్చడమేనని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు వెనుక ఉన్న ఉద్దేశం.. డీలిమిటేషన్ ద్వారా భారతదేశ నియోజకవర్గాలను మార్చడమే అన్నారు. దక్షణాది రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాల సీట్ల సంఖ్యను తగ్గించి.. అనుకూలమైన రాష్ట్రాల సంఖ్యను పెంచుకోవడమే డీలిమిటేషన్ ఉద్దేశం అని పేర్కొన్నారు. అధికార పార్టీ కుట్రలను విపక్షాలు తిప్పికొట్టాయన్నారు.

ఇది కూడా చదవండి: Supreme Court: నేతాజీని జాతీయ పుత్రుడిగా ప్రకటించలేం.. తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు

తమిళనాడులో ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుంది. రేపటితో ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇదిలా ఉంటే ఇటీవల ఏప్రిల్ 16 నుంచి 18 వరకు కేంద్రం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించింది. మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టింది. అయితే ఓటింగ్ సమయంలో బిల్లులు వీగిపోయాయి.