NTV Telugu Site icon

Rahul Gandhi: బీజేపీది “విద్యా వ్యతిరేక మనస్తత్వం”.. ఐఐటీ విద్యార్థుల పరిస్థితిపై రాహుల్..

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి బీజేపీ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. దేశంలో యువత నిరుద్యోగంతో పూర్తిగా నిరుత్సాహానికి గురైందని, బీజేపీది విద్యా వ్యతిరేక మనస్తత్వం అని వారి భవిష్యత్తు ‘‘అస్తవ్యస్థంగా’’ మారిందని ఆరోపించారు. 2024లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఇంజనీర్ల వేతనాలు, తక్కువ ఉద్యోగ రిక్రూట్మెంట్ కారణంగా తగ్గాయని వచ్చిన మీడియా రిపోర్టులను ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Read Also: Sand Mafia: ఉచిత ఇసుకపై మాఫియా కన్ను.. ఆ చిన్న అవకాశాన్ని అనుకూలంగా మార్చుకుని..!

‘‘ఆర్థిక మందగమనం దుష్ప్రభావాలు ఇప్పుడు దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఐటిల వంటి సంస్థలు ఎదుర్కొంటున్నాయి. ఐఐటిల నుండి ప్లేస్‌మెంట్‌లు నిరంతరం పడిపోవడం మరియు వార్షిక ప్యాకేజీలో తగ్గుదల నిరుద్యోగం యొక్క గరిష్ట స్థాయిని ఎదుర్కొంటుంది. యువత పరిస్థితి నిరంతరం దెబ్బతీస్తోంది.’’ అని రాహుల్ గాంధీ తన వాట్సాప్ ఛానెల్‌లో పోస్ట్ చేశారు. 2022లో 19 శాతం మంది విద్యార్థులు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ పొందలేకపోయారని, ఇది ఈ ఏడాది 38 శాతానికి పెరిగిందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

దేశంలో అత్యంత ప్రసిద్ధ ఐఐటీల పరిస్థితి ఇలా ఉంటే, మిగిలిన విద్యాసంస్థల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ రోజు యువత నిరుద్యోగంతో పూర్తిగా కుంగిపోయిందని, వృత్తి విద్య కోసం తల్లిదండ్రులు లక్షలు వెచ్చిస్తున్నారని, విద్యార్థులను అధిక వడ్డీకి అప్పులు తీసుకువచ్చి చదివించాల్సి వస్తోందని, ఉద్యోగం లేక సాధారణ ఆదాయం రాకుంటే వారి ఆర్థిక స్థితి క్షీణిస్తుందని అన్నారు. ఈ దేశంలో ప్రతిభావంతులైన యువత భవిష్యత్తు అస్తవ్యస్తం కావడానికి బీజేపీ విద్యా వ్యతిరేక ఆలోచనలే కారణమని ఆరోపించారు. కష్టపడి పనిచేసే యువతను సంక్షోభం నుంచి విముక్తి చేయడానికి మోడీ ప్రభుత్వం వద్ద ఏదైనా ప్రణాళిక ఉందా.? అని అడిగారు. ప్రతిపక్షం యువత గొంతుగా, అన్యాయాలకు ప్రభుత్వాన్ని బాధ్యుల్ని చేస్తుందని అన్నారు.