Rahul Gandhi: బెంగాల్ కాంగ్రెస్ నాయకులపై రాహుల్‌గాంధీ ఫైర్.. ఏం జరిగిందంటే..!

  • బెంగాల్‌లో టీఎంసీ పరాజయం
  • మమత ఓటమిపై కాంగ్రెస్ నేతలు వెకిలి నవ్వులు
  • బెంగాల్ నాయకులపై మండిపడ్డ రాహుల్‌గాంధీ
Rahulgandhi

Rahulgandhi

పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ నాయకులపై రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా వెలువడిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ ఓటమిపై ఆ పార్టీ నేతలు వెకిలి నవ్వులు నవ్వారు. ఈ వ్యవహారం రాహుల్ గాంధీకి కోపం తెప్పించింది.

ఈ సందర్భంగా సొంత పార్టీ నాయకులను గట్టిగా మందలించారు. బీజేపీ తన లక్ష్యంలో విజయం సాధిస్తోందని.. ఇలాంటి సమయంలో మనం సంకుచిత రాజకీయాలను పక్కన పెట్టాలని సూచించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పార్టీ శ్రేణులకు వార్నింగ్ ఇచ్చారు. ‘‘కాంగ్రెస్‌లోని కొందరు టీఎంసీ ఓటమిని చూసి సంబరపడుతున్నారని.. ఇదేమీ పద్ధతి కాదు అసోం, బెంగాల్ ప్రజల తీర్పును అపహరించడం అనేది.. భారత ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసే లక్ష్యంతో బీజేపీ వేసిన భారీ ముందడుగు.’’ అని రాహుల్ గాంధీ రాసుకొచ్చారు. ఇక నుంచి ‘‘చిల్లర రాజకీయాలను పక్కన పెట్టండి. ఇది ఏ ఒక్క పార్టీకి సంబంధించిన విషయం కాదు. ఇది భారతదేశానికి సంబంధించిన విషయం.’’ అని అన్నారు.

బెంగాల్‌లో బీజేపీ ఘన విజయం సాధించింది. 294 స్థానాలకు గాను 207 స్థానాలను కమలం పార్టీ కైవసం చేసుకుంది. టీఎంసీ 80, కాంగ్రెస్ 5 సీట్లు గెలుచుకుంది. అయితే రాజీనామా చేసేందుకు మమతా బెనర్జీ మొండికేశారు. ఓట్ చోరీతో బీజేపీ గెలిచిందని ఆరోపించారు.