Site icon NTV Telugu

Goa Minister: తల్లిని ప్రేమించని రాహుల్ గాంధీ దేశాన్ని ఎలా ప్రేమిస్తాడు..?

Rahul Gandhi

Rahul Gandhi

Goa Minister: బీహార్ కాంగ్రెస్ ప్రధాని నరేంద్రమోడీ తల్లి గురించి ఏఐ వీడియో చేయడం వివాదాస్పదమవుతున్న తరుణంలో గోవా మంత్రి విశ్వజిత్ రాణే సంచలన విషయాలు వెల్లడించారు. తన తండ్రి, గోవా మాజీ సీఎం, సీనియర్ కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ రాణే ఒకసారి రాహుల్ గాంధీ, తన తల్లి సోనియాగాంధీపై అరవడం చూశారని పేర్కొన్నారు. ప్రధాని మోడీ తల్లి దివంగత హీరాబెన్ మోడీపై ఏఐ వీడియోను కాంగ్రెస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం రాహుల్ గాంధీని తీవ్రంగా విమర్శించారు. ఇది ‘‘కాంగ్రెస్ పార్టీ విలువల పూర్తి పతనాన్ని సూచిస్తుంది’’ అని అన్నారు.

Read Also: Shankarpally Robbery: శంకర్‌పల్లిలో దారి దోపిడీ.. రూ. 40 లక్షలతో పారిపోతుండగా కారు బోల్తా!

ప్రధాని తల్లి గురించి కాంగ్రెస్ ఏఐ వీడియో చేయడం సిగ్గుచేటని గోవా ఆరోగ్య మంత్రి రాణే అన్నారు. విశ్వజిత్ రాణే, కాంగ్రెస్ సీనియర్ నేత ప్రతాప్ సింగ్ రాణే కుమారుడు. ప్రతాప్ సింగ్ గోవాకు ఏడు సార్లు సీఎంగా పనిచేశారు. 50 ఏళ్లు అసెంబ్లీ సభ్యుడిగా ఉన్నారు. 2017లో విశ్వజిత్ రాణే బీజేపీలో చేరారు. ప్రస్తుతం, ప్రభుత్వంలో ఆరోగ్య మంత్రిగా ఉన్నారు.

‘‘రాహుల్ గాంధీ ఒకప్పుడు తన సొంత తల్లిని తన ముందే ఎలా అరిచారో నా తండ్రి నాకు చెప్పడం ఇప్పటికీ గుర్తుంది. ఇంట్లో తన సొంత తల్లికి గౌరవం ఇవ్వని రాహుల్ గాంధీ నుంచి భారతదేశం ఏం ఆశించగలదు.?’’ అని రాణే తన ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. కాంగ్రెస్ పదే పదే మహిళా, మాతృశక్తిని అవమానించాలని అనుకుంటున్నారని అన్నారు.

Exit mobile version