NTV Telugu Site icon

Rahul Gandhi: రాహుల్‌ గాంధీ భద్రతలో లోపం.. కాన్వాయ్‌ పక్కనే కర్ర పట్టుకుని బైక్‌పై వెళ్లిన వ్యక్తి

Rahul Ji

Rahul Ji

Rahul Gandhi: కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ భద్రతలో ఉల్లంఘన జరిగింది. కర్ర చేతిలో పట్టుకున్న ఒక వ్యక్తి బైక్‌పై ఆయన కాన్వాయ్‌ పక్క నుంచే వెళ్లిపోవడం తీవ్ర కలకలం రేపుతుంది. కాగా, ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న హర్యానాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. రాహుల్‌ ఈరోజు (సోమవారం) హర్యానా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా రోడ్డుపై ఆయన కాన్వాయ్‌ వెళ్తుండగా ఒక వ్యక్తి రాహుల్‌ గాంధీ వాహనం పక్కగా బైక్‌పై వెళ్లాడు. వృద్ధుడైన ఆ వ్యక్తి చేతిలో పొడవైన కర్ర ఒకటి ఉంది.

Read Also: Virat Kohli: సచిన్ రికార్డును బద్దలు కొట్టిన కింగ్ కోహ్లీ..

ఈ నేపథ్యంలో రాహుల్‌ గాంధీ భద్రతలో ఉల్లంఘన జరిగినట్లు అనేక ఆరోపణలు వస్తున్నాయి. కాంగ్రెస్‌ కీలక నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడి కాన్వాయ్‌ వెళ్తున్నప్పుడు పక్కగా బైక్‌ వెళ్లేందుకు భద్రతా సిబ్బంది పర్మిషన్ ఇవ్వడంపై అనేక విమర్శలు వస్తున్నాయి. మరోవైపు 90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీకి అక్టోబర్‌ 5వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 8వ తేదీన కౌంటింగ్‌ నిర్వహించి తుది ఫలితాలు వెల్లడిస్తారు.

Show comments