Rahul Gandhi said BJP is his guru: కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ శనివారం బీజేపీపై సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. తనకు బీజేపీనే రోడ్ మ్యాప్ చూపిస్తుందని.. ఎప్పటికీ చేయకూడని వాటిని నేర్పుతోందని శనివారం వ్యాఖ్యానించారు. ఈ విషయంలో బీజేపీనే నా గురువు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మాపై దూకుడుగా దాడి చేయాలని కోరుకుంటోందని.. ఇది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుందని.. నేను బీజేపీని గురువుగా భావిస్తాను.. వారు నాకు మార్గం చూపుతున్నారు, ఎప్పటికీ చేయకూడని అంశాలపై శిక్షణ ఇస్తున్నారని సెటైరికల్ కామెంట్స్ చేశారు.
Read Also: Mercedes Car: రిషబ్ పంత్ బతికున్నాడంటే “కారు” కూడా కారణమే.. ఆ కారు ప్రత్యేకతలివే..
కన్యాకుమారి నుంచి యాత్ర ప్రారంభించే సమయానికి దీన్ని కేవలం ఓ పాదయాత్రగానే చూశానని.. ఇప్పడు ఈ యాత్రకు గొంతుక, ప్రజల భావాలను కలిగి ఉందని అన్నారు. భారత్ జోడో యాత్రలో అందరికి తలుపుతు తెరిచి ఉన్నాయని.. మాతో చేరకుండా మేము ఎవరినీ ఆపబోమని.. అఖిలేష్, మాయావతి ‘‘ మెహబ్బత్ కా హిందూస్థాన్’’ కోరుకుంటున్నారని అన్నారు. ఇతర ప్రతిపక్ష పార్టీను భారత్ జోడో యాత్రలోకి ఆహ్వానించారు.
సెప్టెంబర్ 7న తమిళనాడు కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ ప్రారంభించారు. మొత్తం 5 నెలల పాటు 3570 కిలోమీటర్ల మేర 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల గుండా యాత్ర కొనసాగుతోంది. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీలో భారత్ జోడో యాత్ర సాగింది. కాశ్మీర్ లో ఈ యాత్ర ముగియనుంది.
