Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఢిల్లీలో CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అయితే, ఈ నిరసనల్లో మహిళా పోలీస్‌పై లైంగిక వేధింపులు జరిగాయని కేంద్ర ప్రభుత్వం తరుఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టులో ఆరోపించారు. పోలీసులకు గాయాలయ్యాయని, వారిని దుర్భాషలాడారని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. రెండు రోజుల క్రితం ఎన్నికల ప్రధాన కార్యాలయానికి వెళ్లేందుకు రాహుల్, ఇండియా కూటమి నేతలు ప్రయత్నించారు. ఈ సమయంలో పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణాత్మక సంఘటనలు జరిగాయి. వీటికి సంబంధించిన దృశ్యాలను పరిశీలించాలని కోర్టును తుషార్ మెహతా కోరారు.
శుక్రవారం, అక్టోబర్ 10 సీజేపీ నిరసనల కారణంగా ఢిల్లీ పోలీసుల ఆంక్షలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సమయంలోనే తుషార్ మెహతా ఈ ఆరోపణలు చేశారు. ఇదిలా ఉంటే, రాహుల్ గాంధీ తీరుపై బీజేపీ ఆరోపించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్‌ను ఎక్స్‌లో షేర్ చేశారు. దీనికి క్షమాపణలు చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.

