Rahul Gandhi: అదానీపై నా తరువాతి ప్రసంగానికి భయపడే మోదీ నాపై అనర్హత వేటు వేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు. మోదీ కళ్లలో భయాన్ని చూశాను. నేను ఏ ప్రశ్న అడిగిన ఆలోచించే అడుగుతానని అన్నారు. అదానీతో మా ముఖ్యమంత్రులకు సంబంధం ఉందని తెలిస్తే జైళ్లలో వేయండి అని అన్నారు. దేశం నాకు గౌరవం, ప్రేమ ఇచ్చారని అన్నారు. ప్రధానిని కాపాడేందుకు ఈ డ్రామా జరుగుతోందని అన్నారు. నేను జైలు శిక్ష గురించి భయపడనని అన్నారు. ప్రజల్లోకి వెళ్లడమే ఇప్పుడు విపక్షాలకు ఉన్న అవకాశం అని అన్నారు. దేశం కోసం ఏం చేయడానికైనా సిద్ధం.. వయనాడ్ ప్రజల మనసులో ఏం ఉందో లేఖ రాస్తానని అన్నారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఖతం అయిందని అన్నారు.
Read Also: Rahul Gandhi: రాహుల్ గాంధీ సంచలన ప్రెస్ మీట్.. ప్రధాని మోదీకి ప్రశ్నల వర్షం..
భారత్ జోడో యాత్రతో ప్రజల్లోకి వెళ్లానని, తాను ప్రజల్లోనే ఉంటానని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్య స్వభావాన్ని రక్షించడం, దేశంలోని సంస్థలను రక్షించడం నా పని అని, దేశంలోని పేద ప్రజల గొంతును వినిపిస్తూనే ఉంటానని రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. తనపై పూర్తిగా అనర్హత వేటు వేసినా పట్టించుకోనని, పార్లమెంట్ లో ఉన్నా లేకున్నా ప్రజలు, దేశం కోసం పనిచేస్తా అని అన్నారు. ‘మోదీ ఇంటి పేరు’ వివాదం గురించి ప్రశ్నించిన జర్నలిస్టుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బీజేపీ కోసం చర్చను తప్పుదారి పట్టించొద్దని సూచించారు. మీరెందుకు బీజేపీ కోసం పనిచేస్తున్నారంటూ మండిపడ్డారు. మీరు బీజేపీకి కోసం పనిచేస్తే బీజేపీ సింబల్ ఛాతిపై పెట్టుకోవాలి అని విమర్శించారు.