బీహార్ ఎన్నికలకు ముందు అంతన్నారు.. ఇంతన్నారు. తీరా ఫలితాలు వచ్చేటప్పటికీ బొక్కబొర్లా పడ్డారు. ఇదంతా ఎవరి గురించి అంటారా? అదేనండీ.. ఇండియా కూటమి గురించి. ఎన్నికల షెడ్యూల్ రాక ముందు నుంచి తమదే అధికారం అంటూ ప్రచారం చేసుకుంది. తీరా ఫలితాలు వచ్చాక సీన్ రివర్స్ అయింది. బీహారీయులు కోలుకోలేని దెబ్బ కొట్టారు.
ఇది కూడా చదవండి: Bihar Election Results 2025: బీహార్‌లో ఎన్డీయే విజయానికి 10 కారణాలు ఇవే!
ఎన్నికలకు ముందు కేంద్ర ఎన్నికల సంఘం బీహార్‌లో ‘SIR’ చేపట్టింది. ప్రత్యేక ఓటర్ సర్వే చేపట్టింది. దీనిపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో నానా రాద్ధాంతం చేశారు. బీజేపీతో ఈసీ కుమ్మక్కై ఓట్ల చోరీకి పాల్పడుతున్నారంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. గత వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు.. ఈ ఇష్యూపైనే నడిచింది. విపక్ష పార్టీలన్నీ పార్లమెంట్ లోపల.. బయట నిరసనలు.. ఆందోళనలు నిర్వహించారు. అంతేకాకుండా బీహార్‌లో తేజస్వి యాదవ్‌తో కలిసి రాహుల్ గాంధీ ‘ఓట్ చోర్’ యాత్ర కూడా చేపట్టారు. అధికార పార్టీ ఓట్ల దొంగతనానికి పాల్పడుతుందంటూ ప్రచారం చేశారు. చివరికి ఈ ప్రచారాన్ని ఎవరూ నమ్మలేదని తేలిపోయింది. బీహారీయులంతా ఏకపక్షంగా.. ఎన్డీఏ కూటమికే మద్దతు తెల్పారు. ఎక్కడా కూడా కాంగ్రెస్ ప్రభావం చూపించలేదు. తొలుత కొన్ని చోట్ల ముందంజలో కొనసాగినా.. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా డౌన్ అయిపోయింది. చివరి హస్తం పార్టీకి రిక్తహస్తమే మిగిలింది. ఎక్కడా కూడా ప్రభావం చూపించలేదు. బీహార్ ఫలితాలను బట్టి ఓట్ల చోరీ ప్రచారాన్ని ఎవరూ నమ్మడం లేదని తేలిపోయింది. ఇకనైనా ఈ వ్యవహారాన్ని వదిలిపెట్టేస్తారా? లేదంటే కొనసాగిస్తారా? అన్నది ముందు ముందు తెలుస్తుంది.
ఇది కూడా చదవండి: Prashant Kishor: అంతా భ్రాంతియేనా? ప్రశాంత్ కిషోర్ వ్యూహం ఇదేనా?
