Site icon NTV Telugu

Punjab: రాహుల్‌ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు.. అందుకే అమరీందర్‌ సింగ్‌ తొలగింపు..!

పంజాబ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత కలహాలు.. చాలా సార్లు బహిర్గతం అయ్యాయి.. మాజీ సీఎం అమరీందర్‌ సింగ్, పీసీసీ చీఫ్‌ నవజ్యోత్‌ సింగ్‌ మధ్య వివాదాల నేపథ్యంలో.. చివరకు అమరీందర్‌ సింగ్‌ సీఎం పదవి పోయింది.. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు.. అయితే, ప్రస్తుతం పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ.. అప్పటి పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఫతేఘర్ సాహిబ్‌లో పర్యటించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ… పంజాబ్ మాజీ సీఎం కెఫ్టెన్ అమరీందర్ సింగ్‌ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు.. పంజాబ్ సీఎంగా ఉన్న అమరీందర్ సింగ్‌ను ఎందుకు తొలగించారో తాను చెబుతున్నా.. పేద ప్రజలకు ఉచిత కరెంటు ఇచ్చేందుకు ఆయన అంగీకరించకపోవడమే కారణంగా తెలిపారు.. నాకు విద్యుత్ సరఫరా చేసే కంపెనీలతో ఒప్పందం ఉందని కెఫ్టెన్ అమరీందర్ సింగ్ చెప్పారని ఈ సందర్భంగా బహిర్గతం చేశారు రాహుల్‌ గాంధీ.

Read Also: Godavari-Cauvery: నదుల అనుసంధానం.. ఐదు రాష్ట్రాలతో కీలక భేటీ

మరోవైపు, పంజాబ్‌లో డ్రగ్స్ వ్యవహారంపై కూడా రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ దేశానికి ముప్పు అని తాను చెబుతూనే ఉన్నానని.. పంజాబ్ ప్రయోగాలు చేయవలసిన రాష్ట్రం కాదని ఇప్పుడు మరోసారి చెబుతున్నట్టు తెలిపారు.. పంజాబ్‌లోని యువత జీవితాలను డ్రగ్స్ నాశనం చేయడం కొనసాగితే రాష్ట్ర అభివృద్ధి అర్థరహితమే అవుతుందన్నారు.. కాగా, పంజాబ్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ.. కాంగ్రెస్ పార్టీలో రిమోట్ కంట్రోల్ సీఎంగా పనిచేయలేదనే.. కెఫ్టెన్ అమరీందర్ సింగ్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించారంటూ ఆరోపించారు.. ఈ నేపథ్యంలో.. అసలు అమరీందర్‌ సింగ్‌ను ఎందుకు తొలగించాల్సి వచ్చిందో చెబుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాహుల్‌ గాంధీ.. కాగా, ఈ నెల 20వ తేదీన పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్‌ జరగబోతోంది.. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 14న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగాల్సి ఉన్నా.. ఫిబ్రవరి 16వ తేదీ శ్రీ గురు రవిదాస్ జీ జయంతి ఉత్సవాల నేపథ్యంలో.. పోలింగ్‌ వాయిదా వేయాలని అన్ని రాజకీయ పార్టీలు కోరాయి.. దీంతో.. ఫిబ్రవరి 20న పోలింగ్‌ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించిన విషయం తెలిసిందే.

Exit mobile version