Site icon NTV Telugu

Rahul Gandhi: దేశ యువతకు ‘అగ్ని పరీక్ష’ పెట్టకండి మోదీ జీ

Rahul

Rahul

కేంద్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన ‘ అగ్ని పథ్’ స్కీమ్ పై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఆర్మీలో చేరాలనుకుంటున్న యువత కొంతమంది ఈ స్కీమ్ ను వ్యతిరేఖిస్తున్నారు. ప్రస్తుతం బీహర్, మధ్య ప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో ఆర్మీ ఆశావహులు తీవ్ర ఆందోళన నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా బీహార్ లో పలు ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగించారు. రైల్వే ట్రాకులపై టైర్లు వేసి కాల్చారు. మూడు రైళ్ల బోగీలకు నిప్పు పెట్టారు ఆందోళనకారులు. చాప్రా, గోపాల్ గంజ్, కైమూర్ జిల్లాల్లో ఆందోళన హింసాత్మకంగా మారాయి.

ఇదిలా ఉంటే బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ‘అగ్నిపథ్’ స్కీమ్ పై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ట్విట్టర్ లో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘‘ ర్యాంకు లేదు, పెన్షన్ లేదు. 2 ఏళ్ల నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ లేదు, 4 ఏళ్ల నుంచి స్థిరమైన భవిష్యత్తు లేదని.. సైన్యం పట్ల గౌరవం లేదని.. దేశంలోని నిరుద్యోగ వాణిని వినండి, దేశంలోని నిరద్యోగ యువత గొంతు వినండి, వారిని అగ్నిపథ్ లో నిడిపించి వారి సంయమనానికి ‘అగ్నిపరీక్ష’ పెట్టకండి మోదీజీ’’ అంటూ ట్వీట్ చేశారు. ఈ స్కీమ్ పై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ కూడా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సైన్యంలో రిక్రూట్మెంట్ ను ఎందుకు ప్రయోగశాలగా చేస్తున్నారని ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వం మంగళవారం ‘ అగ్నిపథ్ ’ స్కీమ్ ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఆర్మీలో 4 ఏళ్లకు యువతీ యువకులను ఆర్మీ, నేవి, ఎయిర్ ఫోర్స్ లోకి రిక్రూట్ చేయనున్నారు. దాదాపుగా 46 వేల మందిని రిక్రూట్ చేసుకోనున్నారు. 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల మధ్య ఉన్న యువత దీనికి అర్హులు. ఆరు నెలల శిక్షణ అనంతర నాలుగేళ్ల పాటు ఆర్మీలో సేవలు అందించనున్నారు. ఆ తరువాత రూ. 11-12 లక్షల ప్యాకేజీతో రిటైర్మెంట్ కానున్నారు. వీరికి రిటైర్మెంట్ తదనంతరం ఎలాంటి పెన్షన్ సౌకర్యం ఉండదు. అయితే రిక్రూట్ చేసుకున్నవారిలో 25 శాతం మంది మాత్రమే 15 ఏళ్ల పాటు ఆర్మీలో పనిచేసే అవకాశం కల్పించనున్నారు.

Exit mobile version