Rahul Gandhi not Ram, but BJP on Ravan’s path says Salman Khurshid: రాహుల్ గాంధీని శ్రీ రాముడితో పోల్చి వివాదం రేపారు సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్. దీనిపై విమర్శలు రావడంత తన ఉద్దేశాన్ని బుధవారం మరోసారి తెలిపారు. రాహుల్ గాంధీ రాముడు కాదని.. కానీ రాముడు చూపిన మార్గంలో నడుస్తున్నారని.. బీజేపీ మాత్రం రావణుడి బాటలో నడుస్తోందని విమర్శించారు. అంతకుముందు రోజు మంగళవారం ఖుర్షీద్, రాహుల్ గాంధీని రాముడితో పోల్చారు. రాహుల్ గాంధీ సూపర్ మ్యాన్ అని.. అంతా చలిలో జాకెట్లు ధరిస్తుంటే.. రాహుల్ గాంధీ టీషర్టుతో పాదయాత్ర చేస్తున్నారని అన్నారు. రాహుల్ గాంధీని రాముడితో పోలిస్తే..కాంగ్రెస్ కార్యకర్తలను భరతుడితో పోల్చారు. రాముడు వెళ్ల లేని ప్రాంతాలకు కూడా భరతుడు వెళ్తాడని చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే దీనిపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. గాంధీ కుటుంబాన్ని ప్రసన్నం చేసుకునేందుకే కాంగ్రెస్ నేతుల ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అవినీతిపరులను రాముడితో పోల్చడం ద్వాారా కాంగ్రెస్ ఎంతకైనా తెగిస్తుందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధఇ గౌరవ్ భాటియా అన్నారు. రాముడు కల్పిక వ్యక్తి అని ఇదే కాంగ్రెస్ గతంలో చెప్పిందని గుర్తు చేశారు. అయితే ఈ వ్యాఖ్యల తర్వాత ఖుర్షీద్ తన తప్పును దిద్దుకునే ప్రయత్నం చేశాడు. రాహుల్ గాంధీ రాముడిలాంటి వాడని నేనెప్పుడు చెప్పలేదని.. భగవంతుడి ఎవరూ భర్తీ చేయలేరని కానీ ఆయన చూపిన బాటలో నడవడానికి అందరూ ప్రయత్నించవచ్చని అన్నారు.