M Kharge: రేపటిలో సార్వత్రిక ఎన్నికల సంగ్రామం ముగుస్తోంది. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. మోడీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి మరోసారి అధికారంలోకి వస్తుందని బీజేపీ పార్టీ భావిస్తుంటే, ఈ సారి బీజేపీని గద్దె దించుతామని ఇండియా కూటమి ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని పదవిపై తన మనసులోని మాట బయటపెట్టాడు. ఇండియా కూటమి, బీజేపీని ఓడించిన తర్వాత, నరేంద్రమోడీ స్థానంలో రాహుల్ గాంధీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాలని ఖర్గే అన్నారు. ప్రియాంకాగాంధీ కూడా ఎన్నికల్లో పోటీ చేసేందుకు తాను ఒత్తిడి తెచ్చానని చెప్పారు.
Read Also: Prajwal Revanna Arrest: “మహిళా పోలీస్” టీమ్‌తో ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్.. సిట్ సానుకూల సందేశం..
ఎన్డీటీవీలో మాట్లాడిన ఖర్గే, భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీ విస్తృతంగా ప్రచారం చేశారని, ప్రధాని మోడీ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారని అన్నారు. రాహుల్ గాంధీనే ప్రధాని పదవికి పాపులర్ ఛాయిస్‌గా చెప్పారు. రాహుల్ యువత, దేశానికి ప్రాతినిధ్యం వహిస్తాడని, ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిత్వంపై ప్రశ్నించగా చెప్పారు. ఇదే విధంగా ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరనేదానిపై కూటమి నిర్ణయిస్తుందని చెప్పారు.
ఇదిలా ఉంటే ఇండియా కూటమిలోని ప్రధాన పార్టీలు ఢిల్లీ వేదికగా జూన్ 1న సమావేశం కానున్నాయి. భవిష్యత్ కార్యాచరణ, జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపుపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం ఖామని ఖర్డే ధీమా వ్యక్తం చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కి 44 సీట్లు రాగా, 2019లో 52 సీట్లను సాధించింది. ఈ సారి కాంగ్రెస్ మంచి పనితీరు కనబరుస్తుందని ఆ పార్టీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
