NTV Telugu Site icon

Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో ఉద్విగ్న సన్నివేశం.. ఉబ్బితబ్బిబ్బైన చిన్నారి

Rahul Gandhi

Rahul Gandhi

Bharat Jodo Yatra: కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో 18వ రోజు విజయవంతంగా సాగుతోంది. భారత్ జోడో యాత్రలో పలుమార్లు ఉద్విగ్న సన్నివేశాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మరో ఆసక్తికర ఘటన జరిగింది. రాహుల్‌ను కలిసిన ఓ పాఠశాల విద్యార్థిని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయింది. రాహుల్ గాంధీ ఆమె చేయిపట్టుకుని ముందుకు సాగుతుండగా.. పట్టలేని సంతోషంతో గెంతులేస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను ‘భారత్‌ జోడో’ ట్విటర్‌ హ్యాండిల్‌లో పోస్టు చేసిన కాంగ్రెస్‌.. ‘ఎలాంటి క్యాప్షన్‌ అవసరం లేదు కేవలం ప్రేమ’ అంటూ పేర్కొంది.

భారత్ జోడో యాత్రలో రాహుల్‌ను ఓ చిన్నారి కలిసిన సందర్భంగా ఆయన మరో ఉద్విగ్నభరిత పోస్ట్‌ను ఆయన ట్విటర్ వేదికగా పంచుకున్నారు. ‘ఇలాంటి క్షణం కోసం వెయ్యి మైళ్లు నడవగలను’ అంటూ రాహుల్‌ క్యాప్షన్‌ ఇచ్చారు. ఆ చిన్నారిని రాహుల్ తన చేతులతో ఎత్తుకోగా.. ఆ చిన్నారి ముఖంపై చేతులు పెట్టుకుని చిరునవ్వు నవ్వింది. భారత్‌ జోడో యాత్రలో రాహుల్ గాంధీ పిల్లలతో సంభాషిస్తున్న అనేక ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.కాళ్లకు బొబ్బలొస్తున్నా రాహుల్‌ గాంధీ ఈ యాత్రను కొనసాగిస్తున్నారు. మలప్పురంలో ముగిసిన యాత్ర రాహుల్‌ నియోజకవర్గమైన వయనాడ్‌కు చేరుకుంది. తమిళనాడులోని కన్యాకుమారిలో సెప్టెంబర్‌ 8న ప్రారంభమైన భారత్ జోడో యాత్ర 150 రోజుల 3,570 కిలోమీటర్ల యాత్ర అనంతరం జమ్మూ కాశ్మీర్‌లో ముగుస్తుంది.