Congress: ఎర్రకోట వేడుకలకు రాహుల్, ఖర్గే డుమ్మా.. సీటింగ్‌పై అసంతృప్తే కారణమా?

  • ఎర్రకోటలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు రాహుల్ గాంధీ, ఖర్గే గైర్హాజరు
  • ప్రోటోకాల్, సీటింగ్ ఏర్పాట్లపై ఇద్దరు నేతల అసంతృప్తి
Rahul Gandhi

Rahul Gandhi

Congress:  దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య వేడుకలు అంబరాన్ని అంటాయి. ఇలాంటి వేళ కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగిన అధికారిక వేడుకలకు హాజరుకాలేదు. అయితే.. ప్రోటోకాల్, సీటింగ్ ఏర్పాట్లపై ఇద్దరు నేతలు అసంతృప్తితో ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. వేడుకల్లో సీటింగ్ వరస, ప్రోటోకాల్ తదితర అంశాలపై రాహుల్, ఖర్గేలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

2024 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో కూడా ఇలాంటి వివాదమే చోటుచేసుకుంది. అప్పట్లో లోక్‌సభ ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీకి ముందు వరసకు బదులుగా వెనక వరసలో సీటు కేటాయించారు. దీనిపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే, ఒలింపిక్ క్రీడాకారులకు సీట్లు కేటాయించాల్సి రావడంతో సీటింగ్ మార్పులు చేశామని రక్షణ మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. ప్రోటోకాల్ ప్రకారం, జాతీయ స్థాయిలో కార్యక్రమాల్లో లోక్‌సభ ప్రతిపక్ష నేతకు సాధారణంగా ముందు వరసలో సీటు కేటాయిస్తారు.