Site icon NTV Telugu

అన్నదాతల సత్యాగ్రహం భేష్‌: రాహుల్‌ గాంధీ

సాగు చట్టాలపై రాహుల్‌ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు తాత్కాలిక బారికేడ్లను మాత్రమే తొలగించారు. త్వరలోనే కేంద్రం తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలు ఉపసంహరణ కానున్నాయన్నారు. అన్నదాతల సత్యాగ్రహం భేష్‌ అంటూ ట్వీట్ చేశాడు. కాగా రైతుల ఆందోళన నేపథ్యంలోఏడాదిగా మూతపడిన ఢీల్లీ- ఉత్తరప్రదేశ్‌ సరిహద్దులను అధికారులు ఇవాళ తెరిచారు.

రానున్న ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పావులు కదుపుతుంది. ఇప్పటికే ప్రియాంక గాంధీతో ఎన్నికలకు సమయం ఉన్నా సభలు సమావేశాలతో ఉత్తరప్రదేశ్‌ రాజకీయం వేడెక్కుతుంది. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన సాగు చట్టాలపై రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేయడం ఆసక్తి కరంగా మారింది.

Exit mobile version