NTV Telugu Site icon

Rahul Gandhi: యూపీఏ, ఎన్డీఏ పాలనపై రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు

Rahulgandhi

Rahulgandhi

యూపీఏ, ఎన్డీఏ పాలనపై లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో యూపీఏ, ఎన్డీఏ ప్రభుత్వాలు విఫలమయ్యాయని తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా రాహుల్‌గాంధీ మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం ఉపాధి సమస్యను పరిష్కరించలేకపోయిందని ధ్వజమెత్తారు. ఇక యూపీఏ, మోడీ ప్రభుత్వం రెండూ కూడా నిరుద్యోగుల సమస్యను మాత్రం పరిష్కరించలేకపోయాయని రాహుల్ ఒప్పుకున్నారు. ఉత్పత్తి ఆధారిత దేశంగా మనం విఫలమై.. దానిని చైనాకు అప్పగించామన్నారు. ఇకనైనా మనం ఉత్పత్తి పైనే పూర్తిగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. మేకిన్‌ ఇండియా మంచి ఆలోచనే అయినప్పటికీ దానిని అమలుచేయడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

‘‘లోక్‌సభ ఫలితాల తర్వాత ప్రధాని మోడీ రాజ్యాంగం ముందు తల వంచవలసి రావడం చూసి నేను సంతోషించాను. లోక్‌సభ మరియు అసెంబ్లీ ఎన్నికల మధ్య మహారాష్ట్ర ఓటర్ల జాబితాలో దాదాపు 70 లక్షల మంది కొత్త ఓటర్లు చేరారు. అది హిమాచల్ ప్రదేశ్ జనాభాతో సమానం. షిర్డీలోని ఒకే భవనంలో 7,000 మందికి పైగా ఓటర్లు చేరారు. వీటన్నింటిలో ఏదో సమస్య ఉంది.’’ అని రాహుల్ ధ్వజమెత్తారు.