Site icon NTV Telugu

Mallikarjun Kharge: ‘‘రాహుల్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించారు’’.. పప్పులో కాలేసిన ఖర్గే..

Mallikarjun Kharge

Mallikarjun Kharge

Mallikarjun Kharge: 2024 లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి మరో ఇబ్బందికర పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన ప్రసంగంలో ఘోరమైన తప్పు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అరవింద్ కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు ఇండియా కూటమి రామ్ లీలా మైదానంలో మహార్యాలీకి పిలుపునిచ్చారు. అయితే ఈ కార్యక్రమంలో ఖర్గే మాట్లాడుతూ..‘‘రాహుల్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించారు’’ అని వ్యాఖ్యానించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Read Also: Lok Sabha Elections: యూపీలో అప్నాదళ్(కే)తో అసదుద్దీన్ ఓవైసీ పొత్తు..

ఈ దేశ స్వాతంత్ర్యం కోసం మేము రక్తమోడాము. దేశాన్ని ఒకటిగా ఉంచేందుకు ఇందిరాగాంధీ ప్రాణాలు త్యాగం చేశారు. రాహుల్ గాంధీ దేశం కోసం అమరుడయ్యాడు. అతని శరీరం ముక్కలైంది. ఇందిరాగాంధీ బుల్లెట్లకు బలయ్యారు’’అని ఖర్గే తన ప్రసంగంలో పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

ఈ రోజు ఢిల్లీలోని రాంలీలా మైదానంలో జరిగిన ‘లోక్‌తంత్ర బచావో’ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమానికి శరద్ పవార్, రాహుల్ గాంధీ, ఉద్ధవ్ ఠాక్రే, ఆర్జేడీకి చెందిన తేజస్వీ యాదవ్, మెహబూబా ముఫ్తీ, ప్రియాంకాగాంధీ, అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ పాల్గొన్నారు. ప్రతిపక్షాలను దెబ్బ కొట్టేందుకు కేంద్రంలో బీజేపీ నాయకులను అరెస్ట్ చేస్తోందని ఇండియా కూటమి నేతలు ఆరోపించారు.

Exit mobile version