Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Rahul Gandhi Is Preparing For Another Trip September Or October

Rahul Gandhi Tour: మరో యాత్రకు సిద్ధమవుతున్న రాహుల్‌ గాంధీ.. సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో ప్రారంభం?

Published Date :July 29, 2023 , 10:08 am
By Naga Maneendra
Rahul Gandhi Tour: మరో యాత్రకు సిద్ధమవుతున్న రాహుల్‌ గాంధీ..  సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో  ప్రారంభం?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Rahul Gandhi Tour: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన జోడో యాత్ర విజయవంతం కావడంతో.. అదే ఊపుతో మరో యాత్రను చేపట్టాలని రాహుల్‌తోపాటు.. ఇటు కాంగ్రెస్‌ పార్టీ కూడా భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే జోడో యాత్ర 2.0 ను చేపట్టాలని కాంగ్రెస్‌ యాక్షన్‌ ప్లాన్‌ రూపొందిస్తున్నట్టు సమాచారం. మరో యాత్ర సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ భారత్‌ జోడోయాత్ర 2.0కు సిద్ధమవుతున్నారు. మొదటి దఫా భారత్‌ జోడో యాత్ర విజయవంతం కావడం.. కాంగ్రెస్‌ శ్రేణులు ఉత్సాహంగా ఉండడంతో రెండో దఫా ఎప్పుడుంటుందా? అనే చర్చ నడుస్తోంది. ఈ తరుణంలో.. సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో యాత్ర 2.0 మొదలుకానుందని కాంగ్రెస్‌ విశ్వసనీయ వర్గాల సమాచారం. భారత్‌ జోడో యాత్ర నేషనల్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ హెడ్‌ దిగ్విజయ్‌ సింగ్‌.. యాత్ర 2.0 కోసం యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేస్తున్నారు. గత వారం నుంచి పలువురు పార్టీ కీలక నేతలతో యాత్ర గురించి ఆయన చర్చలు జరుపుతున్నారు. అయితే చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని.. యాత్ర-2 ప్రారంభ తేదీ, రూట్‌మ్యాప్‌ మీద ఇంకా చర్చలు జరపాల్సి ఉందని ఏఐసీసీ సభ్యుడు ఒకరు చెబుతున్నారు. ఈ అంశాలపై తుది నిర్ణయం మాత్రం హైకమాండ్‌దేనని అంటున్నారాయన.

Read also: Tamilnadu : ఘోరం..40 ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ఢీ కొట్టిన లారీ..

రాహుల్ గాంధీ భారత్‌ జోడో యాత్ర సెప్టెంబర్‌ 7, 2022లో కన్యాకుమారి(తమిళనాడు) నుంచి ప్రారంభమై.. జనవరి 30, 2023 శ్రీనగర్‌(జమ్ముకశ్మీర్‌)తో ముగిసిన విషయం తెలిసిందే. యాత్రను ప్రారంభించడానికి ముందు అహ్మదాబాద్‌(గుజరాత్‌)లోని మహాత్మాగాంధీ స్మారకం వద్ద రాహుల్‌ గాంధీ నివాళులు అర్పించాడు. దీంతో గాంధీ జన్మస్థలం అయిన పోర్‌బందర్‌(గుజరాత్‌) నుంచి రెండో విడత యాత్ర మొదలుపెట్టాలనే ఆలోచన చేస్తోంది కాంగ్రెస్‌. పోర్‌బందర్‌ నుంచి పలు రాష్ట్రాల గుండా అగర్తలా(త్రిపుర)తో యాత్ర ముగిసేలా రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేయాలని భావిస్తోంది. రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర దక్షిణం నుంచి ఉత్తరానికి సాగింది. దీంతో రెండో దఫా యాత్రను పశ్చిమం నుంచి తూర్పు వైపునకు చేయాల్సి ఉంటుంది. అయితే.. ఎంతలేదన్న యాత్రకు ఆరు నెలల టైం పట్టే అవకాశం ఉంది కాబట్టి.. ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని ఓ సీనియర్‌ నేత అభిప్రాయపడుతున్నారు. అలాగే సార్వత్రి ఎన్నికలకూ పెద్దగా సమయం ఉండదు.. తక్కువ సమయం ఉండడంతో యాత్రను మొదటి యాత్రలా పూర్తి మార్గం గుండా కాకుండా.. ఎంపిక చేసిన ప్రాంతాల్లో చేసేలా ఏర్పాట్లు చేసుకునే ఆలోచనను భారత్‌ జోడో యాత్ర నేషనల్‌ కమిటీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో యాత్ర ప్రారంభించడానికి ప్లాన్‌ చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Another Trip
  • Preparing
  • rahul gandhi
  • September Or October
  • tour

తాజావార్తలు

  • Bellamkonda Srinivas: కాబోయే భార్య ‘కావ్య’పై..శ్రీనివాస్ ఎమోషనల్ పోస్ట్!

  • Saida Begum: విజయవాడ టెర్రర్ లింక్ లో హైదరాబాదీ సైదా బేగం.. విచారణ లో సంచలన విషయాలు వెలుగులోకి

  • Sharwanand: ప్రాణాలకు తెగించినా గుర్తింపు లేదా? ‘జాను’ షూటింగ్ ప్రమాదంపై శర్వానంద్ ఆవేదన!

  • Trump: ప్రపంచానికి ఈరోజు గొప్ప రోజు.. స్వర్ణయుగం రాబోతుందన్న ట్రంప్

  • Hardik Pandya: బుమ్రా, బౌల్ట్ ఉన్నా ఫలితం శూన్యం.. ముంబై ఓటమిపై పాండ్యా ఫైర్.. బౌలర్లపై తీవ్ర విమర్శలు!

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions