Site icon NTV Telugu

Rahul Gandhi: “ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోంది, చైనాపై ప్రశంసలు”.. కొలంబియాలో రాహుల్ గాంధీ..

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి విదేశాల్లో భారత ప్రజాస్వామ్యంపై విమర్శలు చేశారు. కొలంబియాలోని ఈఐఏ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ విద్యార్థులతో మాట్లాడుతూ..ప్రజాస్వామ్యంపై దాడి భారత్‌కు అతిపెద్ద ముప్పు అని అన్నారు. భారత్‌లో అనేక మతాలు, సంప్రదాయాలు, భాషలు ఉన్నాయని, ప్రజాస్వామ్య విధానం అందరికి స్థానం కల్పిస్తుందని, కానీ ప్రస్తుతం ప్రజాస్వామ్య వ్యవస్థపై అన్ని రకాలుగా దాడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు.

Read Also: Vaayuv Tej : వరుణ్ తేజ్, లావణ్యల కొడుకు పేరు ఏంటో తెలుసా?

భారత్‌ని చైనాతో పోలుస్తూ.. భారత్ 1.4 బిలియన్ల జనాభాను కలిగి ఉంది, అపార అవకాశాలు ఉన్నాయని, కానీ భారత్ చైనాతో పూర్తిగా భిన్నంగా ఉందని, చైనా వ్యవస్థ కేంద్రీకృతమై ఉందని, భారత్ తో మాత్రం వికేంద్రీకరణ ఉందని, వివిధ సంస్కృతులు, భాషలు, మతాలు ఉన్నాయని, ఇది సంక్లిష్టమైన వ్యవస్థ అని అన్నారు. భారత్‌లో భిన్నమైన ఆచారాలు, మతాలు, ఆలోచనలు ఉన్నాయని, ఇవి వ్యక్తమయ్యే స్థలం కావాలని అని అన్నారు. కానీ ప్రస్తుతం ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూల్చివేయాలనే ప్రయత్నం జరుగుతోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. భిన్న మతాలు, సంప్రదాయాలను ప్రోత్సహించడం భారత్‌కి చాలా అవసరమని, చైనా లాంటి నియంతృత్వం భారత్‌లో కుదరదని ఆయన అన్నారు. ప్రపంచ నాయకత్వాన్ని అందుకునేందుకు భారత్ సిద్ధంగా లేదని, గ్లోబల్ లీడర్ షిప్ రేసులో చైనా ముందు ఉందని రాహుల్ గాంధీ అన్నారు. చైనా కన్నా భారత జనాభానే ఎక్కువ అని ఆయన అన్నారు.

ఎనర్జీ ట్రాన్సిషన్ సమయంలో సామ్రాజ్యాలు ఏర్పడుతాయని, బ్రిటిష్ స్టీమ్ ఇంజన్, బొగ్గును నియంత్రించి ప్రపంచశక్తిగా మారిందని, అమెరికన్లు తరువాత పెట్రోల్, ఇంటర్నల్ కంబషన్ ఇంజన్‌తో ఆధిపత్యం సాధించారని, ఇప్పుడు ఫ్యూయెల్ ట్యాంక్ నుంచి బ్యాటరీకి మారుతున్న సమయంలో చైనా, అమెరికా పోటీ పడుతున్నాయని, ఈ పోటీలో చైనా ముందుంది అని చెప్పారు. చైనా పొరుగు దేశం కావడం వల్ల, అమెరికా భాగస్వామిగా ఉండటం వల్ల, భారత్ ఈ రెండు శక్తుల మధ్య నిలుస్తోందని రాహుల్ గాంధీ అన్నారు.

Exit mobile version