Site icon NTV Telugu

Rahul Gandhi: గుజరాత్ కాంగ్రెస్ నేతలు.. బీజేపీతో చేతులు కలిపారు

Rahulgandhi

Rahulgandhi

గుజరాత్ కాంగ్రెస్ నేతలపై ఆ పార్టీ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గుజరాత్‌లో సగం మంది కాంగ్రెస్ నేతలు బీజేపీతో చేతులు కలిపారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. శుక్రవారం పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. శనివారం పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు బీజేపీకి బీ-టీమ్‌గా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. నకిలీ నేతలకు బుద్ధి చెప్పకపోతే గుజరాత్ ప్రజల మనసు గెలుచుకోలేమని తెలిపారు.

ఇది కూడా చదవండి: MLC Kavitha: మహిళల కోసం కేసీఆర్ అనేక పథకాలు, కార్యక్రమాలు చేపట్టారు..

గుజరాత్ ప్రజలు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారని.. బీ గ్రూప్ మాత్రం కోరుకోదన్నారు. అందుకే రెండు గ్రూపులను ఫిల్టర్ చేయడం తన బాధ్యత అని చెప్పారు. కొన్ని కఠినమైన చర్యలు తీసుకోవల్సిన అవసరం వచ్చిందని.. 20, 30 మందిని తొలగించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: Nadendla Manohar: రాజకీయాల్లో మహిళలు మరింతగా ఎదగాలి..

Exit mobile version