లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ లోక్‌సభలో గరం గరం అయ్యారు. బుధవారం సభలో రాహుల్‌గాంధీ ప్రసంగిస్తుండగా స్పీకర్ ఓం బిర్లా పదే పదే అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ మాట్లాడుతుండగానే సభను స్పీకర్ వాయిదా వేసేశారు. దీంతో స్పీకర్ తీరును రాహుల్‌గాంధీ తీవ్రంగా తప్పుపట్టారు. సభలో తనను మాట్లాడటానికి స్పీకర్ అనుమతించడం లేదని.. సభా కార్యకలాపాలను నిర్వహించడానికి ఇది సరైన మార్గం కాదంటూ ఓం బిర్లాపై రాహుల్ ధ్వజమెత్తారు. స్పీకర్ తీరు కారణంగా మాట్లాడకుండా ఆగిపోవల్సి వచ్చిందని ఆరోపించారు.
ఇది కూడా చదవండి: GV Prakash : ఒకే సారి మూడు సినిమాలు.. హిట్ దక్కేనా..?
రాహల్ మీడియాతో మాట్లాడారు. సభలో ఏం జరుగుతుందో తనకు తెలియదు అన్నారు. తనను మాట్లాడనివ్వమని స్పీకర్‌ను సమయం కోరాను. కానీ అందుకు తనకు అవకాశం ఇవ్వకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. సభను నడిపేందుకు ఇది సరైన మార్గం కాదని తెలిపారు. అనవసరంగా స్పీకర్ వాయిదా వేసుకుని వెళ్లిపోయారన్నారు. ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడటానికి సమయం ఇవ్వడం ఆచారం.. కానీ తాను మాట్లాడేందుకు లేచినప్పుడల్లా స్పీకర్ అడ్డుతగులుతున్నారని ధ్వజమెత్తారు. దీంతో తాను నిశ్శబద్దంగా కూర్చోవల్సి వచ్చిందని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. తాను సభలో మహా కుంభమేళా, నిరుద్యోగం గురించి మాట్లాడేందుకు సమయం అడిగాను.. కానీ స్పీకర్ మాత్రం వాటి గురించి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదన్నారు. సభలో ప్రజాస్వామ్యానికి చోటేలేదని రాహుల్ గాంధీ ఆరోపించారు.