Site icon NTV Telugu

Rahul Gandhi: ‘ఢిల్లీ పొల్యూషన్’పై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. రాహుల్‌గాంధీ డిమాండ్

Rahul Gandhi

Rahul Gandhi

దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం ముప్పు తిప్పలు పెడుతోంది. స్వచ్ఛమైన గాలి లేక నగర వాసులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వృద్ధులు, పిల్లల పరిస్థితి అయితే మరీ దయనీయంగా మారింది. అనేక ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు. ఇక ప్రజలు బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. ప్రస్తుతం వాతావరణం మరింత దారుణంగా తయారైంది.

ఇది కూడా చదవండి: Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. శాశ్వతంగా ఆ దేశాల నుంచి వలసల నిలిపివేత

ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీని ఢిల్లీ వాసులు కలిసి తమ గోడు వెళ్లబుచ్చుకున్నారు. ఢిల్లీలో జీవించలేకపోతున్నామని వాపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఢిల్లీలో అత్యవసర ఆరోగ్య పరిస్థితిని విధించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఢిల్లీ కాలుష్యంపై చర్చ జరగాల్సిందేనని కోరారు.

ఇది కూడా చదవండి: Trump: కాల్పుల ఎఫెక్ట్.. గ్రీన్‌ కార్డ్ హోల్డర్స్‌కు కష్టాలే!.. ట్రంప్ కీలక ఆదేశాలు

‘‘నేను కలిసిన ప్రతి తల్లి నాకు ఒకటే చెప్పారు. బిడ్డలు విషపూరిత గాలిని పీల్చుకుంటున్నారని. నీరసించి పోవడమే కాకండా భయపడుతున్నారని చెప్పారు. ఆందోళనగా ఉంటున్నారని వాపోయారు. మోడీ జీ.. భారతదేశ పిల్లలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మీరెలా మౌనంగా ఉండగల్గుతున్నారు? మీ ప్రభుత్వానికి ఎందుకు అత్యవసర ప్రణాళిక లేదు. జవాబుదారీతనం లేదా?’’ అంటూ రాహుల్ గాంధీ ఎక్స్‌లో రాసుకొచ్చారు. ‘‘ఆరోగ్య అత్యవసర పరిస్థితిని’’ పరిష్కరించడానికి దేశానికి ఒక కార్యాచరణ ప్రణాళిక అవసరమన్నారు. ‘‘మన పిల్లలు స్వచ్ఛమైన గాలికి అర్హులు- సాకులు, పరధ్యానాలు కాదు.’’ అని పేర్కొన్నారు. వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చర్చ జరపాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. డిసెంబర్ 1 నుంచే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. నవంబర్ 30న ఆల్ పార్టీ మీటింగ్ జరగనుంది.

 

Exit mobile version