Rahul Gandhi: రాహుల్ గాంధీ భవితవ్యం.. రేపు ‘‘పరువు నష్టం’’ కేసులో కోర్టు తీర్పు..
- రాహుల్ గాంధీ ‘‘పరువునష్టం’’ కేసులో రేపు కోర్టు తీర్పు..
- 2018లో అమిత్ షాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో కేసు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సంబంధించిన ‘‘పరువు నష్టం’’ కేసులో సుల్తాన్ పూర్ ప్రత్యేక ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు సోమవారం, అక్టోబర్ 26న తీర్పు వెలువరించబోతోంది. 2018లో అప్పటి బీజేపీ జాతీయఅధ్యక్షుడు అమిత్‌షాపై రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై కేసు నమోదైంది. తీర్పు వెలువడే సమయంలో రాహుల్ గాంధీ స్వయంగా కోర్టుకు హాజరుకావాల్సి ఉంది.
2018లో కర్ణాటకలోని బెంగళూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ, అమిత్ షాను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ బీజేపీ నేత, జిల్లా సహకార బ్యాంక్ మాజీ అధ్యక్షుడు విజయ్ మిశ్రా అదే ఏడాది ఆగస్టు 4న ఫిర్యాదు చేశారు. ఈ కేసులో 2023 నవంబర్ 27న విచారణను ఎదుర్కొనేందుకు రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు జారీ చేసింది. ఆ తర్వాత రాహుల్ గాంధీ హాజరుకాగా, ఆయనకు బెయిల్ మంజూరైంది.
Also Read
- Mann Ki Baat: ‘వోకల్ ఫర్ లోకల్’తో ప్రపంచ మార్కెట్లలోకి భారత ఉత్పత్తులు!.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
- Dhanush Political Entry: చెన్నై వేదికగా ధనుష్ గ్రాండ్ ఈవెంట్.. 58 జిల్లాల నుంచి మహిళా ప్రతినిధులు
- Wings Over Ganga Air Show: వారణాసిలో ‘వింగ్స్ ఓవర్ గంగా’ ఎయిర్ షో.. వైమానిక ప్రదర్శనను వీక్షించనున్న ప్రధాని మోడీ
- Congress Delhi Rally: నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ భారీ ర్యాలీ.. 10 లక్షల మంది వస్తారని పార్టీ ప్రకటన..
అయితే, ఈ కేసులో ఫిర్యాదిదారు అయిన విజయ్ మిశ్రా, ఆ తర్వాత రాహుల్ గాంధీ వాయిస్ శాంపిల్ పోలిక కోసం అభ్యర్థించారు. ట్రయల్ కోర్టు మిశ్రా పిటిషన్‌ను కొట్టివేయగా, సెషన్స్ కోర్టు కూడా ఈ ఉత్తర్వులకు వ్యతిరేకంగా దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌ను కొట్టివేసింది. రెండు కోర్టుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించగా, ఈ పిటిషన్‌ను హైకోర్టు కూడా కొట్టివేసింది.
తాజావార్తలు
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ భవితవ్యం.. రేపు ‘‘పరువు నష్టం’’ కేసులో కోర్టు తీర్పు..
-
Nothing Phone (5) Pro: నథింగ్ Phone (5) Pro, Phone (5) ఫస్ట్ లుక్.. 144Hz డిస్ప్లే, 8K వీడియో, భారీ బ్యాటరీ?
-
Rob Walter: రెండు మ్యాచ్‌లలో గెలిచేవాళ్లం.. ఈ ఒక్క కారణంతోనే ఓడిపోయాం.. కివీస్ హెడ్ కోచ్ ఆవేదన..
-
Mann Ki Baat: ‘వోకల్ ఫర్ లోకల్’తో ప్రపంచ మార్కెట్లలోకి భారత ఉత్పత్తులు!.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
-
Home Minister Anitha: ఈ ఐదు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. హోంమంత్రి కీలక సూచనలు
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!