NTV Telugu Site icon

BJP: రాహుల్ అగౌరవంగా ప్రవర్తించారు.. బీజేపీ మహిళా ఎంపీ ఆరోపణ

Rajaysabha

Rajaysabha

పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభం నుంచి హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. నవంబర్ 25న ప్రారంభమైన సమావేశాలు ఏ రోజు సాఫీగా సాగలేదు. అదానీ లంచాల వ్యవహారం ఉభయ సభలను కుదిపేశాయి. ఇదిలా ఉండగా తాజాగా రాజ్యసభలో అంబేద్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అమిత్ షాను కేబినెట్ నుంచి బర్త్‌రఫ్ చేయాలంటూ ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఆవరణలో అధికార-ప్రతిపక్ష ఎంపీల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఓ బీజేపీ ఎంపీని రాహుల్‌గాంధీ తోసేయడంతో తీవ్రగాయాలు పాలయ్యారు. కాంగ్రెస్ మాత్రం.. అధికార పార్టీ ఎంపీలే.. ఖర్గేను తోసేశారంటూ రాహుల్ ఆరోపించారు. ఇలా ఇరుపక్షాల మధ్య వాగ్యుద్ధం నడుస్తోంది.

ఇది కూడా చదవండి: Pratap Sarangi: రాహుల్ గాంధీ గాయపరిచిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సారంగి ఎవరు..?

ఈ రచ్చ సాగుతుండగానే మరో బీజేపీ మహిళా ఎంపీ ఫంగ్నాన్ కొన్యాక్.. ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీపై ఫిర్యాదు చేశారు. రాహుల్ గాంధీ తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖర్‌కు ఫిర్యాదు చేశారు. నిరసన సమయంలో రాహుల్.. తనకు చాలా దగ్గరగా వచ్చారని.. ఆ సమయంలో చాలా అసౌకర్యంగా అనిపించిందని వాపోయారు. తన గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్‌తో పాటు ఇతర కాంగ్రెస్ సభ్యులు కూడా తన దగ్గరగా వచ్చారని.. తనతో చాలా తప్పుగా ప్రవర్తించారని వాపోయారు.

ఇది కూడా చదవండి: YS Jagan: చీకటి తర్వాత వెలుగు కూడా వస్తుంది.. ఎవరికి ఏ కష్టం వచ్చినా నావైపు చూడండి..

ఇదిలా ఉంటే అధికార పార్టీ ఎంపీలను తోసేశారన్న కారణంతో రాహుల్‌గాంధీపై ఫిర్యాదు చేసేందుకు బీజేపీ సిద్ధపడుతోంది. రాహుల్‌పై చర్చలు తీసుకోవాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తోంది. దీనిపై కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో చూడాలి. మొత్తానికి పార్లమెంట్ సమావేశాలు.. నిరసనలు, ఆందోళనలతో సభా సమయం తుడుచుకు పెట్టుకు పోతుంది.

 

Show comments