Rahul Gandhi: ఆటో డ్రైవర్ అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
- ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ
- డ్రైవర్లతో కలిసి భోజనం చేసిన ప్రతిపక్ష నేత
- సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఆటో అవతారమెత్తారు. శుక్రవారం ఢిల్లీలో ఆటో డ్రైవర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఢిల్లీలోని బెంగాలీ మార్కెట్ ప్రాంతంలోని తోడర్మల్ పార్క్‌లో ఆటో డ్రైవర్లతో సమావేశమై సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సమస్యలను పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఆటో డ్రైవర్ యూనిఫామ్ ధరించి కనిపించారు. చిన్నారులతో సెల్ఫీలు దిగుతూ అందరినీ ఆకట్టుకున్నారు. అనంతరం ఆటో డ్రైవర్లతో కలిసి భోజనం చేశారు.
ఆటో డ్రైవర్ రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ.. తమ వ్యాపారం మందగించిందని.. పెరుగుతున్న ఖర్చులతో జీవనం కష్టంగా మారిందని రాహుల్ గాంధీకి వివరించామని తెలిపారు. తమ పిల్లల చదువు, రోజువారీ ఆదాయం, కుటుంబ పోషణ గురించి కూడా రాహుల్ అడిగి తెలుసుకున్నారని చెప్పారు. “మేమంతా కలిసి దాల్, రోటీ, కూరతో సాధారణ భోజనం చేశాం” అని రమేష్ ప్రసాద్ తెలిపారు. మరో ఆటో డ్రైవర్ అరిందర్ కుమార్ షా మాట్లాడుతూ.. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ముఖ్యంగా గ్యాస్ ధరల పెరుగుదల వల్ల జీవనం చాలా కష్టమైందని రాహుల్ గాంధీకి వివరించామని చెప్పారు.
Also Read
- IMD Alert: దక్షిణాదిలో వడగాలులు.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
- Acid Attack Victims: యాసిడ్ దాడి బాధితులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం..
- Shraddha Walkar case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో సంచలనం.. అఫ్తాబ్ ‘సైకో’గా తేల్చిన ఫోరెన్సిక్ పరీక్షలు..
- PM Modi: పుతిన్‌ను ఒప్పించి, అణు యుద్ధాన్ని అడ్డుకుంది మోడీనే: పోలాండ్ మంత్రి.
“ఆటో డ్రైవర్ల సమస్యలకు మద్దతుగా నిలుస్తానని, మా సమస్యలను నేరుగా ప్రధాని నరేంద్ర మోడీ ముందు పార్లమెంట్లో ప్రస్తావిస్తానని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. మేమంతా కలిసి రోటీ, బీహార్ స్టైల్ ఆలూ కీ సబ్జీతో భోజనం చేశాం” అని ఆనందం వ్యక్తం చేశాడు.
#WATCH | Delhi: Congress leader and Lok Sabha LoP Rahul Gandhi was spotted outside his residence wearing an auto‑rickshaw driver’s uniform. He interacted with auto‑rickshaw drivers and even shared a meal with them during the conversation. pic.twitter.com/QsHLOJzyjN
— ANI (@ANI) May 29, 2026
VIDEO | Delhi: Lok Sabha LoP Rahul Gandhi (@RahulGandhi) interacts with auto drivers at Todarmal Park, Bengali Market.
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/ibe97tCYTQ
— Press Trust of India (@PTI_News) May 29, 2026
తాజావార్తలు
-
IMD Alert: దక్షిణాదిలో వడగాలులు.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
-
Venkatesh Maha: రంగస్థలం నేను రాసిన కథ: డైరెక్టర్ వెంకటేష్ మహా
-
Acid Attack Victims: యాసిడ్ దాడి బాధితులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం..
-
Pawan Kalyan: రేపు హైదరాబాద్‌కు పవన్ కల్యాణ్.. ఫిజియోథెరపీ తప్పనిసరి
-
Netanyahu-Iran: ఇరాన్‌కు నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్.. ఈసారి దాడి చేస్తే మాత్రం..!
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!