Rahul Gandhi: మహిళా బిల్లు కాదు, అందుకే అడ్డుకున్నాం..

  • ఇది మహిళా రిజర్వేషన్ బిల్లు కాదు..
  • భారత రాజకీయాన్ని మార్చాలని బీజేపీ కుట్ర..
  • అందుకే బిల్లులను అడ్డుకున్నాం..
  • కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ..
Rahulgandhi2

Rahulgandhi2

Rahul Gandhi: మహిళా బిల్లుకు బ్రేక్ పడింది. కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోయింది. 2/3 వంతు మద్దతు తీసుకురావడంతో ఎన్డీయే విఫలమైంది. అయితే, బిల్లు వీగిపోయిన తర్వాత కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోడీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా బిల్లు పేరుతో బీజేపీ రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. దీనిని మొత్తం దేశం చూసిందని, ఇండియా కూటమి బిల్లును అడ్డుకుందని ఆయన అన్నారు. రాజ్యాంగంపై జరిగిన దాడిని మేము తిప్పికొట్టామని, ఇది మహిళా రిజర్వేషన్ బిల్లు కాదని, భారత రాజకీయ స్వరూపాన్ని మార్చే మార్గమని ఆయన అన్నారు. ఇదే సమయంలో 2023లో తీసుకువచ్చని మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకువస్తే దానికి ప్రతిపక్షాలు పూర్తిగా మద్దతు ఇస్తాయని అన్నారు.