Rahul Gandhi: ప్రధాని ఇంటి ముందు ధర్నాకు రావాలి.. దేశ ప్రజలకు రాహుల్ గాంధీ విజ్ఞప్తి

  • ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ ధర్నా..
  • విద్యార్థులపై దాడి ప్రతీ కుటుంబం దాడిగా అభివర్ణించిన రాహుల్ గాంధీ..
Rahulgandhi

Rahulgandhi

Rahul Gandhi: సోమవారం జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు,నిరసనకారులపై పోలీసులు లాఠీఛార్జ్‌ను నిరసిస్తు మంగళవారం కాంగ్రెస్ పార్టీ మెరుపు ధర్నా చేసింది. ప్రధాని నివాసం ముందు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు కాంగ్రెస్ కీలక నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, మల్లికార్జున ఖర్గే, డీకే శివకుమార్‌లతో పాటు కాంగ్రెస్ ఎంపీలు పాల్గొన్నారు. విద్యార్థులపై దాడికి నిరసనగా ప్రధాని నరేంద్రమోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే, విద్యార్థులపై దాడి అంటే ప్రతీ భారతీయ కుటుంబంపై దాడిగా రాహుల్ గాంధీ అభివర్ణిస్తూ ట్వీట్ చేశారు. సమాధానాలు చెప్పకుండా, ఎలాంటి పరిణామాలు ఎదుర్కోకుండా తప్పించుకునేందుకు ప్రధాని మోడీ భావిస్తున్నారనని, కాని అది సాధ్యం కాదని అన్నారు. విద్యార్థులకు న్యాయం జరిగాలని కోరుకునే ప్రతీ దేశభక్తి గల భారతీయుడు ప్రధాని నివాసం ముందు జరిగే ధర్నాలో తమతో కలిసి పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.