Site icon NTV Telugu

Parliamentary Standing Committee: పార్లమెంటరీ స్టాడింగ్‌ కమిటీ సభ్యుడిగా రాహుల్‌ గాంధీ

Parliamentary Standing Comm

Parliamentary Standing Comm

Parliamentary Standing Committee: పార్లమెంటు సభ్యులుగా ఎన్నికైన వారిని వివిధ స్టాండింక్‌ కమిటీల్లో సభ్యులుగా కొనసాగిస్తారు. లోక్‌సభకు ఎన్నికైన వారితోపాటు, రాజ్యసభకు ఎంపికైన వారిని ఇలా పార్లమెంటరీ స్థాయి సంఘం స్టాండింగ్‌ కమిటీల్లో సభ్యులుగా తీసుకుంటారు. అటువంటి అవకాశాన్ని కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభ ఎంపీ అయిన రాహుల్‌ గాంధీకి కల్పించారు. ఎంపీ రాహుల్‌ గాంధీకి పార్లమెంటరీ స్టాడింగ్‌ కమిటీ సభ్యుడిగా మరోసారి అకాశం కల్పించారు. రక్షణ శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా నియమించారు. ఇందుకు సంబంధించి లోక్‌సభ బులెటిన్‌ను విడుదల చేసింది. రక్షణ శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం స్టాండింగ్‌ కమిటీ సభ్యుడిగా రాహుల్‌ గాంధీ బుధవారం నామినేట్‌ అయ్యారు. ఆయనతోపాటు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మరో ఎంపీ అమర్‌సింగ్‌ కూడా కమిటీకి నామినేట్‌ అయ్యారు. ఇందుకు సంబందించి బుధవారం లోక్‌సభ ఒక బులెటిన్‌ విడుదల చేసింది.

Read also: Michi Rate: ఇది చాలా హాట్ గురూ… మిరపకాయ ధర రూ.7000

మోడీ ఇంటిపేరు కేసులో 2 సంవత్సరాల జైలు శిక్ష అనంతరం రాహుల్‌ గాంధీ తన పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే. చివరికి సుప్రీంకోర్టకు వెళ్లిన తరువాత సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పుతో మోడీ ఇంటిపేరు కేసులో విధించిన శిక్షపై స్టే విధించడంతో .. రాహుల్‌ గాంధీ పార్లమెంట్‌ సభ్యత్వం 4 నెలల తరువాత పునరుద్దరణ జరిగిన విషయం తెలిసిందే. మోడీ ఇంటిపేరు పరువు నష్టం కేసులో అనర్హత వేటు పడకముందు రాహుల్‌ గాంధీ రక్షణ శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘంలో సభ్యుడిగా ఉన్నారు. రాహుల్‌ లోక్‌సభ సభ్యత్వాన్ని ఆగస్టు 7న పునరుద్ధరిస్తూ లోక్‌సభ సెక్రటేరియట్‌ బులెటిన్‌ ఇవ్వడంతో పార్లమెంట్‌ సభ్యత్వం తిరిగిన పొందారు. దీంతో గతంలో రక్షణ శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘంలో సభ్యుడిగా కొనసాగిన రాహుల్‌ను తిరిగి అదే కమిటీలోకి తీసుకున్నారు.

Exit mobile version