Site icon NTV Telugu

Delhi: లోక్‌సభ స్పీకర్‌తో రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ భేటీ

Priyankagandhi

Priyankagandhi

పార్లమెంట్‌‌‌లో లోక్‌సభ స్పీకర్‌తో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ, సోదరి ప్రియాంకాగాంధీ సమావేశం అయ్యారు. ఈ భేటీ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. స్పీకర్‌తో ఏం చర్చించారన్నది ఇంకా తెలియలేదు. అయితే త్రిభాషా విధానానికి వ్యతిరేకంగా డీఎంకే సభ్యులు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆందోళన చేపట్టారు. దీంతో ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి.

ఇది కూడా చదవండి: Minister Nara Lokesh: పదవులు రాలేదని ఎవరూ ఆందోళన చెందొద్దు.. లోకేష్‌ కీలక సూచనలు

ఇదిలా ఉంటే రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఓటర్ల జాబితాపై అనేక అనుమానాలు ఉన్నాయని.. వీటిపై సభలో చర్చించాలని కోరారు. ప్రతిపక్షాలతో పాటు దేశ ప్రజలకు కూడా అనేకమైన అనుమానాలు ఉన్నట్లు తెలిపారు. మహారాష్ట్ర జాబితాతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న జాబితాపై చర్చించాలని కోరారు. దాదాపు ఇదే అంశంపై మరోసారి స్పీకర్‌తో రాహుల్ గాంధీ చర్చించి ఉండొచ్చని తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: IPL: ఐపీఎల్‌లో ప్రకటనలపై కేంద్రం కీలక ఆదేశాలు

సోమవారం (మార్చి10) నుంచి రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. తొలి విడత బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమై.. ఫిబ్రవరి 13న ముగిశాయి. ఇక ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇక సోమవారం నుంచి రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి.

 

Exit mobile version