Site icon NTV Telugu

Rahul Gandhi: మహారాష్ట్ర తర్వాత, బీహార్‌లో కూడా ‘‘ఫిక్సింగ్’’ చేస్తారు.. స్పందించిన బీజేపీ..

Rahulgandhi

Rahulgandhi

Rahul Gandhi: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని మోసం చేశారంటూ ఆయన ఎక్స్‌లో రాశారు. ఈ ఏడాది జరగబోయే బీహార్ ఎన్నికల్లో కడా బీజేపీ రిగ్గింగ్ చేయాలని చూసతోందని ఆయన పేర్కొన్నారు. ‘‘ఎందుకంటే మహారాష్ట్ర మ్యాచ్ ఫిక్సింగ్ తర్వాత బీహార్ ఎన్నికలు వస్తున్నాయి, ఆపై బీజేపీ ఓడిపోయే చోట రిగ్గింగ్ చేస్తుంది’’ అని ఆయన రాశారు.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు మరియు ఫలితాలను పక్కదారి పట్టించడానికి బీజేపీ వివరణాత్మక ఐదు-దశల ప్రక్రియను అమలు చేసిందని రాహుల్ ఆరోపించారు. కేంద్రానికి భారీగా అనుకూలంగా ఉండటానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం 2023లో ఎన్నికల కమిషనర్ల నియామకానికి సవరించిన చట్టాన్ని తీసుకువచ్చిందని ఆయన పేర్కొన్నారు. ‘‘అంపైర్ల నియామకానికి ప్యానెల్‌ని రిగ్ చేయండి’’ అని రాహుల్ గాంధీ ఎన్నికల కమిషనర్ల నియామక చట్టంపై విమర్శలు గుప్పించారు. సవరించిన చట్టం ప్రకారం, ఎంపిక కమిటీలో ప్రధానమంత్రి, కేంద్ర క్యాబినెట్ మంత్రి, ప్రతిపక్ష నాయకుడు/లోక్‌సభలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఉంటారు. ఎంపిక కమిటీ తర్వాత ప్రధాన ఎన్నికల కమిషన్ లేదా ఎన్నికల కమిషనర్ల పేరును రాష్ట్రపతి సిఫారసు చేస్తారు.

Read Also: కుర్రాళ్లలో హీటు పెంచేస్తున్న గోల్డెన్ గర్ల్ అనసూయ.. తట్టుకోగలరా?

ఎంపిక కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తికి బదులుగా క్యాబినెట్ మంత్రిని ఎందుకు ఉంచారో ఆలోచించాలని రాహుల్ గాంధీ అన్నారు. ఒక ముఖ్యమైన సంస్థలో తటస్థ మధ్యవర్తిని తొలగించడానికి ఎవరైనా ఎందుకు ప్రయత్నిస్తారు..? అని ప్రశ్నించారు. రెండవ, మూడవ దశల్లో, ఓటర్ల జాబితాలు నకిలీ ఓటర్లతో నిండిపోయాయని రాహుల్ ఆరోపించారు. ఓటింగ్ ముగిసిన తర్వాత ఓటర్ల సంఖ్య “అపూర్వమైన 7.83 శాతం పాయింట్లు” ఎలా పెరిగిందని ఆయన ప్రశ్నించారు.

అయితే, రాహుల్ గాంధీ వ్యాఖ్యలు బీజేపీ అంతే ధీటుగా స్పందించింది. బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా స్పందిస్తూ.. రాహుల్ గాంధీ ఏకైక లక్ష్యం స్పష్టత కాదని, గందరగోళం అని ఆరోపించారు. మన సంస్థాగత ప్రక్రియ గురించి ఓటర్ల మనస్సులో సందేశాలు, అసమ్మతిని పెంచేందుకు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ గెలిచిన చోట వ్యవస్థ న్యాయంగా ఎందుకు కనిపిస్తుంది..? వారు ఓడిపోయిన చోట కుట్ర సిద్ధాంతాలను ఎందుకు తెరపైకి తెస్తున్నారు..? అని ప్రశ్నించారు. ఇది నేరుగా జార్జ్ సోరోస్ నాటకం నుంచి వచ్చిందని, ప్రజలు తమ సొంత సంస్థలపై విశ్వాసాన్ని క్రమంగా ఎందుకు క్షీణింపజేస్తున్నారని ప్రశ్నించారు. రాజకీయ లాభాల కోసం రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

Exit mobile version