Site icon NTV Telugu

Rahul Gandhi: ట్రంప్‌కు అభినందనలు.. కమలకు ఆల్ ది బెస్ట్ చెప్పిన రాహుల్

Rahulgandhi

Rahulgandhi

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్‌నకు ప్రపంచ నాయకులు అభినందనలు తెలుపుతున్నారు. సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రధాని మోడీ కూడా ఎక్స్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. మిత్రుడు ట్రంప్‌కు అభినందనలు అంటూ మోడీ పేర్కొన్నారు. తాజాగా కాంగ్రెస్ కూడా శుభాకాంక్షలు చెప్పింది. లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ.. ట్రంప్‌కు అభినందనలు తెలిపారు. అలాగే ఓటమి పాలైన కమలా హారిస్‌కు ‘‘ఆల్ ది బెస్ట్’’ చెప్పారు.

ఇది కూడా చదవండి: NaniOdela2 : దసరా దర్శకుడితో నాని నెక్స్ట్ సినిమా టైటిల్ ఇదే

అమెరికా అధ్యక్షుడిగా రెండవసారి విజయం సాధించినందుకు ట్రంప్‌నకు రాహుల్ అభినందనలు తెలిపారు. అలాగే కమలా హారిస్‌కు భవిష్యత్ ప్రయత్నాలకు ‘‘ఆల్ ది బెస్ట్’’ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కూడా ట్రంప్‌కు అభినందనలు తెలిపారు. భారతదేశం-యునైటెడ్ స్టేట్స్ బలమైన సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ఆకాంక్షించారు. ‘‘ప్రపంచ శాంతి మరియు శ్రేయస్సు కోసం యునైటెడ్ స్టేట్స్‌తో కలిసి పనిచేయడానికి మేము ఎదురుచూస్తున్నాము’’ అని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పేర్కొన్నారు. ట్రంప్ 270 ఎలక్టోరల్ ఓట్లతో గెలుపు మార్కును క్రాస్ చేసి 280 ఓట్లు సాధించారు. అమెరికా చరిత్రలో అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్ర సృష్టించారు.

 

Exit mobile version