UP: రాయ్‌బరేలీ ఆస్పత్రిలో అమానుషం.. రోగిని కాలుతో తన్నిన సిబ్బంది.. ప్రజలు ఆగ్రహం
- రాయ్‌బరేలీ ఆస్పత్రిలో అమానుషం
- రోగిని కాలుతో తన్నిన సిబ్బంది
- ప్రభుత్వం సీరియస్.. సస్పెండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ జిల్లా ఆస్పత్రిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. మానవత్వం మంటగలిసింది. రోగి అన్న కనీస స్పృహ లేకుండా సిబ్బంది కాలుతో తన్నుతూ దారుణంగా ప్రవర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెద్ద ఎత్తున నెటిజన్లు ధ్వజమెత్తారు. ఇదేం మానవత్వం అంటూ మండిపడుతున్నారు.
రాయ్‌బరేలీ జిల్లా ఆస్పత్రిలో కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న పింకీ… నేలపై కూర్చున్న మానసిక వికలాంగుడైన యువకుడిని దారుణంగా తన్ని, దూషించింది. 39 సెకన్లలో 10 సార్లు తన్ని.. దూషించింది. ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అయింది. దీంతో పెద్ద ఎత్తున ప్రజలు ప్రశ్నించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ మండిపడ్డారు. ఇదేం మానవత్వం అంటూ నిలదీశారు. సీఎంవో ఆదేశాల మేరకు వెంటనే మహిళా కార్మికురాలిని సస్పెండ్ చేశారు.
Also Read
- Tamil Nadu: సీఎం విజయ్ కీలక నిర్ణయం.. ఇకపై ఏసీ ప్రభుత్వ బస్సులే ఉంటాయని ప్రకటన
- Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్‌పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
- Monsoon Shock: 125 ఏళ్ల తర్వాత ముఖం చాటేసిన వరుణుడు.. ఐదో అత్యంత పొడి జూన్గా రికార్డ్
- SC ST Atrocities Act: బాంబే హైకోర్టు సంచలన తీర్పు.. ఇస్లాంలోకి మారితే SC/ST ఎట్రాసిటీ యాక్ట్ వర్తించదు!
ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ చర్య తీసుకున్నారు. ఎక్స్‌లో ఇలా రాశారు. ‘‘రాయ్‌బరేలీ జిల్లా ఆస్పత్రిలో మానసిక వికలాంగుడైన రోగి పట్ల ఒక స్వీపర్ దురుసుగా ప్రవర్తిస్తున్న వైరల్ వీడియోను సుమోటోగా స్వీకరించి, నా ఆదేశాల మేరకు, రాయ్‌బరేలీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆ స్వీపర్‌ను తక్షణమే సస్పెండ్ చేశారు. ఇటువంటి సంఘటన ఏ పరిస్థితులలోనూ క్షమించరానిది. ఏ రోగి పట్ల దురుసుగా ప్రవర్తించడాన్ని ఏమాత్రం సహించబోము..’’ అని అన్నారు. చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ పుష్పేంద్ర కుమార్ కూడా ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించారు. మహిళా పారిశుద్ధ్య కార్మికురాలి అనుచిత ప్రవర్తన కారణంగా ఆమెను తక్షణమే సస్పెండ్ చేశామని, ఈ విషయంపై విచారణ జరుగుతోందని సీఎంఎస్ తెలిపారు.
यह युवक मानसिक रूप से बीमार बताया जा रहा है, जमीन पर पड़ा है, महिला वार्ड बॉय लातों से मार रही और गालियां दे रही है।
अस्पताल से भगाने का प्रयास कर रही है, इस दौरान बगल में सिक्योरिटी गार्ड हाथ बांधे खड़े है लेकिन मैडम के आगे उन्होंने कोई जहमत नहीं उठाई न ही कि कोई हस्तक्षेप… pic.twitter.com/lUcOb5BmdE
— Ashish Paswan (@ashishpaswan0) June 30, 2026
తాజావార్తలు
-
UP: రాయ్‌బరేలీ ఆస్పత్రిలో అమానుషం.. రోగిని కాలుతో తన్నిన సిబ్బంది.. ప్రజలు ఆగ్రహం
-
Kodali Nani: కొడాలి నానికి ఏపీ హైకోర్టులో ఊరట.. ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు.!
-
CM Revanth Reddy : రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IND vs ENG: సిక్సర్ల వేటలో జోస్ బట్లర్‌కు సవాల్ విసురుతున్న అభిషేక్ శర్మ.. టాప్-5 బ్యాటర్ల లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్‌ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!