Radhika Merchant: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడి వివాహ కార్యక్రమాలు మొదలయ్యాయి. ముఖేష్ అంబానీ-నీతా అంబానీల చిన్న కొడుకు అనంత్ అంబానీతో రాధిక మర్చంట్ వివాహం జరగబోతోంది. మెహందీ వేడుకల్లో కాబోయే కోడలు రాధికా మర్చంట్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. గులాబీ కలర్ లెహంగాతో మెరిసిపోతోంది. ఎన్‌కోర్ హెల్త్‌కేర్ సీఈఓ విరెన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్, అనంత్ అంబానీ చిన్ననాటి నుంచి స్నేహితులు. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నారు. దీంతో ఇరు కుటుంబాల్లో పెళ్లి సందడి మొదలైంది.
Read Also: Arvind Kejriwal: గవర్నర్లను మోడీ ఆడిస్తున్నారు.. బీజేపీని తరిమికొట్టాలి
మంగళవారం జరిగిన మెహందీ వేడుకల్లో రాబోయే పెళ్లి కూతురు రాధిక డ్యాన్స్ చేసింది. కళంక్ సినిమాలోని ‘‘ఘర్ మోర్ పర్దేశియా’’ రిథమ్ కి అనుగుణంగా డ్యాన్స్ చేసింది. రాధికా స్వయంగా క్లాసికల్ డ్యాన్సర్. ముంబైలోని శ్రీ నిభా ఆర్ట్స్ కు చెందిన భావన థాకర్ మార్గదర్శకత్వంలో ఆమె దాదాపు 8 సంవత్సరాలు భరతనాట్యం నేర్చుకున్నారు. నీతా అంబానీ కూడా భరతనాట్యంలో ప్రావీణ్యం ఉంది. నీతా అంబానీ తర్వాత అంబానీ కుటుంబంలో భరత నాట్యం నేర్చుకున్న రెండో వ్యక్తి కోడలు రాధికా మర్చంటే. అబు జానీ, సందీప్ ఖోస్లా డిజైన్ చేసిన లెహంగాలో బ్యూటీఫుల్ గా కనిపించింది రాధికా. డిసెంబర్ 29న వీరిద్దరికి ఎంగేజ్మెంట్ జరిగింది.