Site icon NTV Telugu

Qutub Minar : తెరపైకి మరో వాదన.. కుతుబ్‌ మినార్ నిర్మించింది రాజా విక్రమాదిత్య..

Qutub Minar

Qutub Minar

దేశంలో రోజుకో విషయం తెరపైకి వస్తోంది. మొన్నటికి మొన్న తాజ్‌ మహల్‌ కంటే ముందు అక్కడ శివాలయం ఉండేదని, ఆ శివాలయం స్థానంలో తాజ్‌ మహల్‌ నిర్మించారని అంటున్నారు. ఓ వాదన తెరపైకి వచ్చింది. అంతేకాకుండా దీనిపై హై కోర్టులో కూడా పిటిషన్‌ దాఖలైంది. ఇదిలా ఉంటే.. ఇటీవలే పవిత్ర పుణ్య క్షేత్రమైన కాశీ క్షేత్రంలోని ఓ జ్ఞానవాపి మసీదు పరిసరాల్లో హిందు ఆలయాల శిథిలాలు కనిపిస్తున్నాయని.. రోజు వారి పూజలకు అనుమతించాలంటూ అక్కడి మహిళలు కోర్టుకెక్కారు.

దీంతో కమిషనర్‌తో కూడి ఓ బృందాన్ని మసీదు దగ్గరు కోర్టు పంపగా.. జ్ఞానవాపి మసీదులోని బావిలో భారీ శివలింగం బయట పడింది. దీంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం మారింది. ప్రస్తుతం జ్ఞానవాపి మసీదులో గురించి అందరూ చర్చించుకుంటున్న సమయంలో.. ఇప్పుడు మరో వాదన తెరపైకి వచ్చింది. ఢిల్లీలోని అరుదైన ఈ పురాతన కట్టడమైన కుతుబ్‌ మినార్‌ను కట్టించింది రాజా విక్రమాదిత్య అంటూ పురావస్తు పరిశోధన శాఖ మాజీ రీజినల్ డైరెక్టర్ ధరమ్ వీర్ శర్మ ప్రకటన చేశారు. దీన్ని కట్టించింది కుతుబ్ ఆల్ దిన్ ఐబక్ కాదన్నది ఆయన వాదన. సూర్యుడి గమనాన్ని అధ్యయనం చేసేందుకు రాజు విక్రమాదిత్య దీన్ని కట్టించినట్టు ఆయన పేర్కొంటున్నారు.

‘‘ఇది కుతుబ్ మినార్ కాదు. సన్ టవర్ (పరిశీలించే గోపురం). 5వ శతాబ్దంలో రాజా విక్రమాదిత్య దీన్ని కట్టించాడు. కుతుబ్ ఆల్ దిన్ ఐబక్ కాదు. ఇందుకు సంబంధించి నా వద్ద ఎన్నో ఆధారాలు ఉన్నాయి’’ అని ధరమ్ వీర్ శర్మ ప్రకటన చేశారు. పురావస్తు శాఖ తరఫున శర్మ కుతుబ్ మినార్ ను ఎన్నో పర్యాయాలు సర్వే చేయడం గమనార్హం.

‘‘కుతుబ్ మినార్ టవర్‌లో 25 అంగుళాల వంపు ఉంటుంది. ఎందుకంటే సూర్యుడిని పరిశీలించేందుకు ఇలా నిర్మించారు. అందుకే జూన్ 21న సూర్య ఆయనంలో (ఉత్తరాయణం నుంచి దక్షిణాయణంలోకి మారే క్రమం) కనీసం అరగంట పాటు ఆ ప్రాంతంపై నీడ పడదు. ఇది సైన్స్. పురాతన వాస్తవం’’ అని తన వాదనకు నేపథ్యాన్ని శర్మ వివరించారు. కుతుబ్ మినార్ అన్నది స్వతంత్ర కట్టడమని, సమీపంలోని మసీదుకు సంబంధించినది కాదని శర్మ పేర్కొన్నారు. కుతుబ్ మినార్ డోర్ కూడా ఉత్తర ముఖంగా ఉంటుందని, రాత్రి వేళ ధ్రువ నక్షత్రాన్ని చూసేందుకేనని శర్మ వివరించారు.

Exit mobile version