Site icon NTV Telugu

Gujarat: షాకైన విద్యార్థులు.. బోర్డు ఎగ్జామ్స్‌ లో వరల్డ్ కప్ ఫైనల్ గురించి ప్రశ్న…!

Ind Vs Aus

Ind Vs Aus

Gujarat: ప్రస్తుతం జరుతున్న గుజరాత్ రాష్ట్ర 10వ తరగతి బోర్డు పరీక్షల్లో వరల్డ్ కప్ ఫైనల్ – 2023 మ్యాచ్ గురించి ఓ ఆసక్తికర ప్రశ్న వచ్చింది. అహ్మదాబాద్‌ లో జరిగిన 2023 ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూశారా..? అయితే ఆ మ్యాచ్ ను మీ పరిశీలనను బట్టి మ్యాచ్ గురించి ఓ రిపోర్ట్ రాయండి.. అంటూ బోర్డు పరీక్ష ప్రశ్న పత్రంలో 4 మార్కులకు ప్రశ్న వచ్చింది. ఎన్నో అంచనాలతో ఈ సారి భారత జట్టు ఖచ్చితంగా విజయం సాధిస్తుందని సగటు భారత అభిమాని ఎంతో అనుకున్నప్పటికీ, ఫైనల్‌లో మాత్రం ఆస్ట్రేలియా చేతిలో అపజయం పాలైంది. ఒక్క అపజయం లేకుండా ఫైనల్ వరకు వచ్చినా, చివరకు వరల్డ్ కప్ గెలవలేకపోయింది.

మొదటగా టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకోవడంతో.. ఓపెనర్ రోహిత్ శర్మ ఎప్పటిలాగే తన దూకుడు ఇన్నింగ్స్ మొదలెట్టాడు. దీనితో కేవలం 31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సహాయంతో 47 పరుగులు చేసి వెనుతిరిగాడు. ఇదే క్రమంలో శుబ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ ఇద్దరు కేవలం చెరో 4 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచారు. ఆపై వెంటవెంటనే 3 వికెట్లు పడడంతో విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ అతి జాగ్రత్తగా ఆచితూచి ఆడారు.

Read Also: Minister Adimulapu Suresh: బీజేపీపై మంత్రి ఆదిమూలపు హాట్‌ కామెంట్లు..

ఇలా నెమ్మదిగా ఆడడంతో భారత జట్టు 50 ఓవర్లలో కేవలం 240 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆపై బ్యాటింగ్ మొదలు పెట్టిన డేవిడ్ వార్నర్ 7, మిచెల్ మార్ష్ 15, స్టీవ్ స్మిత్ 4 పరుగులు మాత్రమే జోడించి వెంటవెంటనే అవుట్ కావడంతో కేవలం 47 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది కంగారు టీం. ఈ పరిస్థితులలో టీం ఇండియా గెలవడం ఖాయమని అందరూ అనుకున్నారు. అయితే, ఆస్ట్రేలియా బ్యాటర్స్ ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్ లు కలిసి నాలుగో వికెట్‌ కి ఏకంగా 192 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పడంతో, ఆస్ట్రేలియాకి ఘన విజయం లభించింది. ఆరవసారి వరల్డ్ కప్‌ని గెలుచుకుంది.

ఇక ఫైనల్‌ మ్యాచ్ పరంగా చూస్తే రోహిత్ శర్మ పేలవ కెప్టెన్సీ, బ్యాటింగ్‌ లో భారత బ్యాటర్ల అతి జాగ్రత్త, టెన్షన్.. ఇలా ప్రతి విషయం కలిసి టీమిండియాకి మరోసారి ఐసీసీ టోర్నీలో నిరాశనే మిగించింది. టీం ఇండియా భారతగడ్డపై ఆడుతున్న సమయంలో వారి ప్రేక్షకులను సైలెంట్ చేస్తా అని చెప్పిన ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ చెప్పినట్టే చేసాడు. అదేవిధంగా గడిచిన సంవత్సరం జూన్‌ లో భారత్‌ పై ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ను కూడా గెలిచిన ప్యాట్ కమ్మిన్స్, నవంబర్‌ మాసంలో ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌ లోనూ భారత జట్టును మడత పెట్టాడు.

Exit mobile version