Uttar Pradesh: వస్త్ర ధారణ అనేది ఒక్కొక్కరిది ఒక్కో రంకంగా ఉంటుంది. ఎవరికి నచ్చిన దుస్తులు వాళ్ళు ధరిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరికి ఏ దుస్థితులు అనుకూలంగా అనిపిస్తే అవి ధరిస్తారు. అయితే కొందరు మోడ్రన్ గా ఉంటారు. మరి కొందరు ట్రెడిషనల్ దుస్తులను ఇష్టపడతారు. ఏ దుస్తులు ధరించాలి అనేది వ్యక్తిగతం. ఆ వ్యక్తిగత స్వేచ్ఛను కాదంటే కాపురాలు రోడ్డున పడతాయి. ఈ మాట ఇప్పుడు చెప్పడానికి కారణం ఓ అత్తాకోడళ్ల దుస్తుల గొడవ.. పంచాయితీకి పోలీసుల వద్దకు చేరింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రా లోని హరిపర్వత్ నివాసి అయిన ఓ యువకుడికి ఎత్మాద్‌పుర్ పరిధికి చెందిన యువతితో ఏడాది క్రితం వివాహం జరిగింది.
Read also:CM YS Jagan Tour Postponed: ఏపీలో భారీ వర్షాలు.. సీఎం జగన్ పర్యటన వాయిదా
అయితే ఆ యువతీ అత్త జీన్స్ ను ధరిస్తుంది. కనుక తన కోడలు కూడా తలానే జీన్స్ వేసుకోవాలని ఆ యువతిని ఒత్తిడి చేయసాగింది. అయితే ఆ యువతి తనకు జీన్స్ వేసుకోవడం ఇష్టం లేదని తాను చీరలే కట్టుకుంటానని పలుసార్లు తన అభిప్రాయం వెల్లడించింది. అయిన అత్త తన పంథా మార్చుకోలేదు. ఈ క్రమంలో ఆ యువతి అత్త ఒత్తిడిని తాళలేక పోలీసులను ఆశ్రయించింది. తాను గ్రామీణ ప్రాంతంలో పెరిగి పెళ్లితో అత్తగారింటికి వచ్చానని.. తనకు జీన్స్ వేసుకోవడం ఇష్టం లేదని.. ఎన్ని సార్లు చెప్పిన అత్త జీన్స్ వేసుకోవాలని ఒత్తిడి చేస్తుందని.. ఈ విషయం భర్తకు చెప్పాగా తిరిగి తననే కొడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ యువతి. ఈ క్రమంలో ఏసీపీ సుకన్య శర్మ మాట్లాడుతూ.. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నాం అని తెలిపారు
