Qualcomm Layoffs: హైదరాబాద్ సహా భారత్‌లో క్వాల్కామ్ ఉద్యోగులకు బిగ్ షాక్..
- క్వాల్కామ్లో లేఆఫ్..
- ప్రపంచవ్యాప్తంగా 3600 ఉద్యోగుల తొలగింపు..?
- భారత్‌లో 1000 మందిపై ప్రభావం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Qualcomm Layoffs: టెక్ రంగంలో ఉద్యోగుల కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రముఖ చిప్ తయారీ సంస్థ క్వాల్కామ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన ఉద్యోగుల తొలగింపుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా భారత్‌లో సుమారుగా 1000 మంది ఉద్యోగుల్ని తొలగించే ఛాన్స్ ఉందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఉద్యోగాల కోతలకు సంబంధించి అధికారికంగా కంపెనీ ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ, ఉద్యోగులు పరిహార ప్యాకేజ్ గురించి చర్చించుకుంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా క్వాల్కామ్ కంపెనీలో సుమారు 52 వేల మంది పనిచేస్తున్నారు. 7 శాతం మందిని తొలగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీని వల్ల 3600 మంది ఉద్యోగాలు పోతాయి. భారత్‌లో బెంగళూర్, హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై రీజినల్ ఆఫీసుల్లో పనిచేసేవారు తమ ఉద్యోగాలను కోల్పోతున్నారు. భారత్‌లో 1000 మంది తమ ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉంది.
Also Read
- Union Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. మ్యూజియం, మెట్రో సహా అభివృద్ధి పనులకు రూ.77,101 కోట్లు
- Jammu Kashmir: సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి..
- Yogi Adityanath: దీపావళి కాలుష్యంపై యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు.. ఆందోళన అవసరం లేదన్న సీఎం
- TVK Leaders Controversies: టీవీకే నేతల వరుస వివాదాలపై సీఎం ఆగ్రహం.. ఎమ్మెల్యేలు, మంత్రులతో అత్యవసర భేటీ..!
క్వాల్కామ్లో లేఆఫ్‌కు గురైన కొందరు ఉద్యోగులు తమకు అందించే సెవరెన్స్ ప్యాకేజ్ గురించి చర్చించుకుంటున్నారు. మూడు నెలల జీతంతో పాటు సంస్థలో పనిచేసిన ప్రతీ ఏడాదికి అదనంగా ఒక నెల జీతం చెల్లించే విధంగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో తొలగింపు పత్రాలపై సంతకాలు చేసి సమర్పిస్తే మరో నెల జీతం అదనంగా ఇస్తామని సంస్థ చెప్పినట్లు ఉద్యోగులు మాట్లాడుకుంటున్నారు.
ఉద్యోగుల తొలగింపుకు వ్యక్తిగత పనితీరు కారణం కాదని, వ్యాపార అవసరాల ఆధారంగానే లేఆఫ్ ప్రకటిస్తున్నట్లు కంపెనీ నిర్ణయం తీసుకుందని రెడ్డిట్‌లో ఓ ఉద్యోగి చెప్పారు. ఏఐపై పెట్టుబడులు, ఖర్చుల తగ్గింపులో భాగంగానే ఈ నిర్ణయాలు తీసుకుని ఉండొచ్చని మరో ఉద్యోగి అనుమానిస్తున్నారు. క్వాల్కామ్ సీఈఓ క్రిస్టియానో అమోన్ గత నెలలో ఉద్యోగులకు పంపిన మెమోలో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల పనితీరు ఆధారంగా తొలగింపులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. మరోవైపు, డేటా సెంటర్లు, ఏఐ, కనెక్టెడ్ డివైజెస్ వంటి కొత్త రంగాల్లో వ్యాపారాన్ని విస్తరించేందుకు సంస్థ ప్రయత్నిస్తోంది. Layoffs.fyi ట్రాకర్ ప్రకారం.. ఈ ఏడాది ఇప్పటివరకు 350 టెక్ కంపెనీల్లో 1.42 లక్షలకు పైగా ఉద్యోగాలు పోయాయి.
తాజావార్తలు
-
Qualcomm Layoffs: హైదరాబాద్ సహా భారత్‌లో క్వాల్కామ్ ఉద్యోగులకు బిగ్ షాక్..
-
Anthropic CEO: 10 ఏళ్లలో క్యాన్సర్ లేని ప్రపంచం.. ఏఐపై భారీ అంచనాలు..
-
Union Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. మ్యూజియం, మెట్రో సహా అభివృద్ధి పనులకు రూ.77,101 కోట్లు
-
Priya Bhavani Shankar Wedding: సైలెంట్‌గా ఏడడుగులు వేసిన హీరోయిన్.. 10 ఏళ్ల ప్రేమకు శుభం కార్డు!
-
Jammu Kashmir: సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి..
ట్రెండింగ్
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్‌గా సంజూ శాంసన్‌కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్‌కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!