Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా, ట్రంప్ వ్యవహారంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. భారత్, చైనాలకు మద్దతుగా నిలిచారు. ఈ రెండు దేశాలను యూఎస్ ఆంక్షల పేరుతో బెదిరించలేదని అన్నారు. చైనాలో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమ్మిట్ అనంతరం మీడియాతో మాట్లాడిన పుతిన్.. ఆసియాలో రెండు అతిపెద్ద శక్తులను అణగదొక్కడానికి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్, టారిఫ్‌లను సాధనంగా ఉపయోగిస్తోందని ఆరోపించారు. భారత్, చైనాలను అమెరికా తమ భాగస్వాములు అని చెబుతూనే, ఈ రెండు దేశాల నాయకత్వాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేస్తోందని పుతిన్ అన్నారు.
Read Also: Sivakarthikeyan: తెలుగు, తమిళ్ ఆడియన్స్ కి తేడా ఏం లేదు !
‘‘150 కోట్ల జనాభా ఉన్న భారతదేశం, శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనాలకు వారి సొంత దేశీయ రాజకీయ యంత్రాంగాలు, చట్టాలు ఉన్నాయి. మీరు శిక్ష విధిస్తామంటే ఆ దేశాల నాయకత్వం ఎలా స్పందిస్తుందో ఆలోచించాలి’’ అని అమెరికా తీరును తీవ్రంగా విమర్శించారు. ‘‘వలసవాదం’’ కాలం ముగిసిందని, భాగస్వామ్య దేశాలపై ఇలాంటి పదాలను ఉపయోగించడం తగదని పుతిన్ హితవు పలికారు.
