Putin In India: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన రెండు రోజుల పర్యటన కోసం భారత్ వచ్చారు. కాసేపటి క్రితం ఆయన ఢిల్లీలోని పాలెం ఎయిర్ బేస్‌లో ల్యాండ్ అయ్యారు. పుతిన్‌ను స్వాగతించేందుకు ప్రధాని నరేంద్రమోడీ ప్రోటోకాల్ బ్రేక్ చేసి మరీ, ఎయిర్ పోర్టుకు వచ్చారు. పుతిన్‌ను ఘనంగా స్వాగతించారు.
Read Also: Modi-putin: పుతిన్‌ను స్వయంగా స్వాగతించనున్న మోడీ.. ఒకే కారులో ప్రయాణం.!
ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం అయిన తర్వాత తొలిసారిగా పుతిన్ భారత్ పర్యటనకు వచ్చారు. పుతిన్ పర్యటనపై దేశంతో పాటు ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ పర్యటనలో భారత్, రష్యాల మధ్య అనేక ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎస్-400, ఎస్-500, SU-57 ఐదో తరం యుద్ద విమానాల వంటి రక్షణ ఒప్పందాలతో పాటు, ఇంధనం, వాణిజ్యం వంటి రంగాల్లో కీలక ఒప్పందాలు ఉండే అవకాశం ఉంది.
#WATCH | Russian President Vladimir Putin lands in Delhi
President Putin is on a two-day State visit to India. He will hold the 23rd India-Russia Annual Summit with PM Narendra Modi in Delhi on December 5 pic.twitter.com/Y6dELuOUbt
— ANI (@ANI) December 4, 2025
