Site icon NTV Telugu

Bangladesh: ‘‘వలసదారులను తోసేయడం ఆమోదయోగ్యం కాదు’’.. భారత్‌కి బంగ్లా ఆర్మీ సవాల్..

Bangladesh

Bangladesh

Bangladesh: భారత అధికారులు ఎలాంటి పత్రాలు లేని వ్యక్తుల్ని బంగ్లాదేశ్‌లోకి తోసేయడం ఆమోదయోగ్యం కాదని, అవసరమైతే తమ సైన్యం రంగంలోకి దిగడానికి సిద్ధంగా ఉందని బంగ్లాదేశ్ ఆర్మీ ఉన్నతాధికారి సోమవారం అన్నారు. బంగ్లాదేశ్ సరిహద్దు రక్షణ దళం, బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (BGB) ప్రస్తుతానికి పరిస్థితిని చక్కగా నిర్వహిస్తోందని మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టరేట్ (MOD) డైరెక్టర్ బ్రిగేడియర్ జనరల్ ఎండీ నజీమ్-ఉద్-దౌలా అన్నారు. ఇటీవల కాలంలో భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయులను అధికారులు గుర్తించి, వారిని స్వదేశానికి పంపిస్తున్నారు. 2016 ప్రభుత్వ అంచనా ప్రకారం, భారతదేశంలో దాదాపు 2 కోట్ల మంది అక్రమ వలసదారులు నివసిస్తున్నారు.

అయితే, అక్రమ వలసదారులను అప్పగించడం, బహిష్కరించడాన్ని బంగ్లాదేశ్ ఉద్దేశపూర్వకంగా ముందుకు తీసుకురావడం అని చెబుతోంది. బంగ్లాదేశ్ అక్రమంగా ఉంటున్న భారతీయులను సరైన మార్గాల్లో పంపుతామని ఆ దేశం చెబుతోంది. యూనస్ ప్రభుత్వానికి, ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ మధ్య విభేదాల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, తాము ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తామని నజీముద్దౌలా అన్నారు. భారతదేశంలో ఉంటున్న అక్రమ బంగ్లాదేశీయులను భారత అధికారులు అప్పగిస్తున్నారనే నివేదికలపై, ప్రభుత్వం ఆదేశిస్తే సైన్యం జోక్యం చేసుకోవడానికి సిద్ధంగా ఉందని చెప్పారు.

Read Also: TDP Mahanadu: రేపటి నుంచి మహానాడు… పసుపు పండుగకు కడప ముస్తాబు..

బంగ్లాదేశ్ హోం వ్యవహారాల సలహాదారు లెఫ్టినెంట్ జనరల్ ఎండీ జహంగీర్ ఆలం చౌదరి (రిటైర్డ్) మే 18న మాట్లాడుతూ, బంగ్లాదేశ్ వలసదారు ఎవరైనా భారతదేశంలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్నట్లయితే, వారిని సరైన మార్గాల ద్వారా స్వదేశానికి రప్పించాలని అన్నారు. బంగ్లాదేశ్‌లో అక్రమంగా ఉంటున్న వారిని భారత్‌లా తాము పంపించమని, దౌత్యం ద్వారా సమస్య పరిష్కారమవుతుందనే నమ్మకం ఉందన్నారు. ఈ వ్యవహారంపై బంగ్లా విదేశాంగ శాఖ భారత్‌కి లేఖ రాసినట్లు చెప్పారు.

ఇటీవల కాలంలో, భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో అక్రమ బంగ్లాదేశ్ వలసదారులు పట్టుబడుతున్నారు. వీరితో పాటు రోహింగ్యాలను అధికారులు గుర్తిస్తున్నారు. ఇటీవల పశ్చిమబెంగాల్ ముర్షిదాబాద్ అల్లర్లకు కూడా అక్రమ వలసలు కారణమని ఆరోపించారు. భారత్‌లో అక్రమంగా నివసిస్తున్న విదేశాలను తర్వగా బహిష్కరించాలని ఫిబ్రవరి 4న అస్సాం ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Exit mobile version