Site icon NTV Telugu

Chocolates: కాలం చెల్లిన చాక్లెట్లు తిని రక్తం కక్కుకున్న పసిబిడ్డ..

Chocolates

Chocolates

Chocolates: కాలం చెల్లిన ఆహార పదార్థాలు ఎంత ప్రమాదమో ఈ ఘటనే నిదర్శనం. ఎక్స్‌పైర్ అయిన చాక్లెట్ తినడంతో ఓ పసిబిడ్డ తీవ్ర అనారోగ్యం పాలైంది. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు, వైద్యారోగ్య శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. గడువు ముగిసిన ఉత్పత్తులను విక్రయిస్తున్న దుకాణాన్ని గుర్తించి, వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

Read Also: Congress: కాంగ్రెస్‌కు మరో షాక్.. బీజేపీలో చేరిన ప్రియాంక సన్నిహితుడు

ఏడాదిన్నర బాలిక కాలం చెల్లిన చాక్లెట్లను తినడంతో రక్త వాంతులు చేసుకుంది. ఈ ఘటన లూథియానాలో చోటు చేసుకుంది. వెంటనే పాపను ఆస్పత్రిలో చేర్పించి, చికిత్స అందిస్తున్నారు. బాలిక తల్లిదండ్రులు కుటుంబంతో కలిసి పాటియాలాలోని బంధువుల ఇంటికి వెళ్లారు. అయితే, పసిపాపకు వారు స్నాక్స్‌తో కూడిన బాక్స్‌ని గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇందులో చాక్లెట్లు కూడా ఉన్నాయి. వీటిని తిన్న పాప తీవ్ర అస్వస్థతకు గురై వాంతులు చేసుకుంది. గడువు ముగిసిన చాక్లెట్లు తినడం వల్లే బాలిక అస్వస్థతకు గురైనట్లు వైద్య పరీక్షల్లో తేలింది.

వీటిని విక్రయించిన దుకాణాన్ని గుర్తించిన అధికారులు, అక్కడ ఎక్స్‌పైర్ అయిన స్నాక్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది మార్చి నెలలో పంజాబ్ పాటియాలలో 10 ఏళ్ల బాలిక పుట్టిన రోజు కేక్ తిని, ఫుడ్ పాయిజనింగ్ కారణంగా మరణించింది. ఈ ఘటన మరవక ముందే ఈ ఘటన చోటు చేసుకుంది. పాటియాల ఘటనలో కేక్ కారణంగానే చిన్నారి మరణించిదని, ఇతర బంధువులు అస్వస్థతకు గురైనట్లు తేలింది.

Exit mobile version