Site icon NTV Telugu

తొలి జాబితా విడుద‌ల చేసిన కెప్టెన్‌.. ఆయ‌న అక్క‌డి నుంచే బ‌రిలోకి..

త్వ‌ర‌లోనే పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి.. ఇప్ప‌టికే ప్ర‌ధాన పార్టీలు త‌మ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తూ.. కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ ప్ర‌చారంలో దూసుకుపోతున్నాయి.. ఇక‌, గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావ‌డానికి కృషి చేసిన కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్.. ఆ త‌ర్వాత పంజాబ్ సీఎంగా ప‌గ్గాలు చేప‌ట్టారు. కానీ, అంత‌ర్గ‌త కుమ్మ‌లాట‌ల‌తో బ‌య‌ట‌కు వెళ్లిపోయి.. పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్‌సీ) పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేశారు.. ఇక‌, పీఎల్‌సీ అధ్యక్షుడు, మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్.. ఇవాళ పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీచేయ‌నున్న త‌మ పార్టీ అభ్య‌ర్థుల జాబితాను విడుద‌ల చేశారు.. 22 మంది పార్టీ అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేశారు. ఇక‌, పాటియాలా నియోజకవర్గం నుంచి కెప్టెన్ పోటీ చేస్తార‌ని ఆ జాబితా ద్వారా స్ప‌ష్ట‌మైంది.. కెప్టెన్ అమ‌రీంద‌ర్‌సింగ్ ప్ర‌క‌టించిన‌ మొత్తం 22 మంది అభ్యర్థుల్లో మఝా ప్రాంతం నుంచి ఇద్దరు అభ్యర్థులను, డొయబ నుంచి ముగ్గురు, మాల్వా ప్రాంతం నుంచి 17 మందిని ఎంపిక చేశారు.. ఇక‌, రెండో జాబితాను మరి రెండు రోజుల్లో విడుదల చేసేందుకు క‌స‌ర‌త్తు చేస్తున్నారు కెప్టెన్‌.

Read Also: ఉద్యోగుల‌కు గుడ్‌న్యూస్‌.. ట్యాక్స్ ఫ్రీ ప‌రిమితి రెట్టింపు..!

Exit mobile version