Site icon NTV Telugu

Punjab Shocker: అసలు వీడు మనిషేనా.. కన్న కూతురినే…

Untitled Design (18)

Untitled Design (18)

పంజాబ్ ఫిరోజ్ పూర్ హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. తన కూతురికి వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఓ తండ్రి ఓ దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Also Read:Tahsildar Attacked: అమ్మవారి గుడిలోకి షూతో వచ్చిన ఎమ్మార్వో.. పొట్టు పొట్టు కొట్టిన భక్తులు

పూర్తి వివరాల్లోకి వెళితే… కూతురికి వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఓ తండ్రి తీసుకున్న దారుణమైన చర్య అందరినీ కలచివేసింది. ఆమెకు ఒక యువకుడితో అక్రమ సంబంధం ఉందని అనుమానించిన తండ్రి ఆమె చేతులను బంధించి కాలువలో పడేశాడు. నిందితుడే ఈ దారుణమైన చర్యను చిత్రీకరించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఈ ఘటనపై వారి బంధువు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Also Read:Yerragadda: కంటోన్మెంట్ లో ఎలా గెలిపించారో.. జూబ్లీహిల్స్ లోనూ గెలిపించాలి: మంత్రి పొన్నం

ఫిరోజ్‌పూర్‌కు చెందిన నిందితుడు సుర్జీత్ సింగ్ చాలా రోజులుగా తన కూతురిపై నిఘా పెట్టాడు. గ్రామానికి చెందిన ఒక యువకుడితో ఆమెకు సంబంధం ఉందని సుర్జీత్ అనుమానించాడు. ఆమెతో చాలాసార్లు తర్కించడానికి ప్రయత్నించాడని తెలిసింది. దీంతో యువతిపై కోపం పెంచుకున్నాడు తండ్రి. రాత్రి తన కుమార్తెను బైక్‌పై ఒక కాలువ వద్దకు తీసుకెళ్లి, ఆమె చేతులు కట్టేసి, ఆపై ఆమెను దారుణంగా కాలువలోకి తోసేశాడు. ఆ అమ్మాయి తల్లి కూడా అక్కడే ఉంది. ఇదంతా కేవలం ఒక వివాహేతర సంబంధం ఉందనే అనుమానం వల్లనే జరిగినట్లు సమాచారం.

Exit mobile version