పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం తన తొలి మంత్రివర్గాన్ని సోమవారం విస్తరించబోతోంది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సోమవారం మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారు. కొత్తగా ఐదుగురు ఎమ్మెల్యేలను మంత్రులుగా తీసుకోనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. పంజాబ్‌లో మూడు నెలల క్రితం ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపడుతున్న తొలి మంత్రివర్గ విస్తరణ ఇదే కావడం విశేషం. పంజాబ్ రాజ్‌భవన్‌లో సోమవారం సాయంత్రం 5 గంటలకు కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం ఉంటుందని ఒక అధికారి తెలిపారు. ప్రస్తుతం కొత్తగా మంత్రులుగా ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారనే విషయంపై జోరుగా చర్చ సాగుతోంది. రెండు రోజుల క్రితం పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను కలవడానికి ఢిల్లీకి వెళ్లారు. ఆయనతో పంజాబ్ మంత్రివర్గ విస్తరణ గురించి చర్చ జరిగినట్లు, మంత్రుల పేర్లు కూడా చర్చకు వచ్చినట్లు పలు వర్గాలు అభిప్రాయపడ్డాయి. కానీ ఆ సమావేశంలో మంత్రివర్గ విస్తరణ గురించి ఎలాంటి చర్చ జరగలేదని.. పంజాబ్‌లో నిర్ణయం తీసుకుంటామని సీఎం భగవంత్ మాన్ వెల్లడించారు.
Jammu Kashmir: టెర్రరిస్టులను పట్టించిన కాశ్మీర్ గ్రామస్తులు.. సర్వత్రా ప్రశంసలు
టీవల జరిగిన సంగ్రూర్ లోక్‌సభ ఉపఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడంతోపాటు పంజాబ్‌లో కూడా రాబోయే కాలంలో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ మంత్రివర్గ విస్తరణ జరగనుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి మంత్రివర్గ విస్తరణలో కూడా అందుకు తగ్గట్టుగానే సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నాలు జరుగుతాయని భావిస్తున్నారు.
ప్రస్తుతం కొత్త మంత్రులు ఎవరనే దానిపైనే ఆసక్తి నెలకొంది. కొత్తగా ఐదుగురు మంత్రులను తీసుకోనుండటంతో మాన్ మంత్రివర్గ సభ్యుల సంఖ్య ఆయనతో కలిపి 15కు చేరుతుంది. మంత్రివర్గంలో కొత్తగా చేర్చుకునే వారిలో సునం నియోజకవర్గం నుంచి రెండుసార్లు గెలిచిన అమన్ అరోరా, జగ్రావ్ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యే అయిన సర్వజిత్ కౌర్ మనుకే, తల్వాండి సబో నుంచి రెండుసార్లు గెలిచిన బల్జీందర్ కౌర్, బుద్‌లాడా నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బుధ్ రామ్, అమృత్‌సర్ సౌత్ ఎమ్మెల్యే సింగ్ నిజ్జర్, ఖరార్ ఎమ్మెల్యే అన్మోల్ గగన్ మాన్ పేర్లు బలంగా వినిపిస్తున్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు అనంతరం భగవంత్ మాన్ నేతృత్వంలోని ప్రభుత్వంలో 10 మందిని మంత్రులుగా తీసుకున్నారు. ఇప్పుడు కొత్తగా 5గురిని తీసుకుంటే కేబినెట్ 15 మంది మంత్రులు ఉండనున్నారు.