పంజాబ్ సీఎం భగవంత్ మాన్ రెండో వివాహం అత్యంత సాదాసీదాగా జరిగింది. చంఢీగఢ్ లోని సెక్టార్ 2లోని ముఖ్యమంత్రి ఇంటి వద్ద గట్టి బందోబస్త్ ఏర్పాటు చేశారు. సన్నిహితులు, బంధువులతో పాటు ఆప్ జాతీయ కన్వనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో పాటు ఆప్ నేత రాఘవ్ చద్ధా వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. హర్యానాలోని కురుక్షేత్రకు చెందిన డాక్టరైన గురుప్రీత్ కౌర్ ను భగవంత్ మాన్ పెళ్లి చేసుకున్నారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కు 48 ఏళ్లు కాగా.. గురుప్రీత్ కౌర్ కు 32 ఏళ్లు.
Read Also: Railway Job to Baby: 10 నెలల చిన్నారికి రైల్వేస్ లో జాబ్.. ఎందుకో తెలుసా?
ఆరేళ్ల క్రితం మాజీ భార్య ఇంద్రప్రీత్ కౌర్ కు విడాకులిచ్చారు భగవంత్ మాన్. మాన్ కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమార్తె సీరత్ కౌర్(21), కుమారుడు దిల్షాన్ (17). ప్రస్తుతం ఇంద్రప్రీత్ కౌర్ తన పిల్లలతో కలిసి యూఎస్ఏలో ఉంటున్నారు. ఈ ఏడాది జరిగిన పంజాబ్ ఎన్నికల్లో ఆప్ భారీ విజయం సాధించింది. సంగ్రూర్ లోక్ సభ నియోజవర్గానికి ఎంపీగా ఉన్న భగవంత్ మాన్ తన పదవికి రాజీనామా చేసి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాడు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని పంజాబ్ లో ఆప్ చిత్తుచిత్తుగా ఓడించింది. మార్చి 16న జరిగిన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఇంద్రప్రీత్ కౌర్, తన ఇద్దరు పిల్లలతో పంజాబ్ వచ్చింది.