NTV Telugu Site icon

Punjab: సీఎం భగవంత్ మాన్‌కు లెప్టోస్పిరోసిస్ నిర్ధారణ

Punjabcmbhagwantmann

Punjabcmbhagwantmann

పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌కు లెప్టోస్పిరోసిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ మేరకు మొహాలీ ఫోర్టిస్ హాస్పిటల్ కార్డియాలజీ విభాగం తెలిపింది. బుధవారం అర్ధరాత్రి భగవంత్ మాన్ హఠాత్తుగా స్పృహ తప్పిపడిపోయారు. హుటాహుటినా ఆయన్ను మొహాలీలోని ఫోర్టిస్ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించగా తాజాగా ఆయనకు లెప్టోస్పిరోసిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.

ఇది కూడా చదవండి: Air India flight: ఆమ్లెట్‌లో బొద్దింక ప్రత్యక్షం.. ప్రయాణికుడికి అస్వస్థత

ప్రస్తుతం ముఖ్యమంత్రి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. యాంటీబయాటిక్స్ అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఇన్ఫెక్షన్ జంతువుల నుంచి గానీ.. లేదా మూత్రం ద్వారా, లేదా నేల, నోటి ద్వారా సంక్రమిస్తుందని యూఎస్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ తెలిపింది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రస్తుతం చికిత్సకు స్పందిస్తున్నట్లు సమాచారం. తీవ్రమైన జర్వం ఉండడంతో ఆయన టెస్టులు నిర్వహించగా ఈ వ్యాధి బయటపడింది.

లెప్టోస్పిరోసిస్ అంటే ఏంటి?
వ్యాధి సోకిన జంతువుల మూత్రం ద్వారా వ్యాపించే బ్యాక్టీరియా వ్యాధి. (కుక్కలు, ఎలుకలు, వ్యవసాయ జంతువులు ద్వారా వస్తుంది). మానవులు.. లెప్టోస్పిరోసిస్‌ను సోకిన జంతువుల నుంచి నేరుగా మూత్రంతో సంప్రదించడం ద్వారా ఈ వ్యాధి వస్తుంది. లేదంటే మూత్రంతో కలుషితమైన నీరు, నేల లేదా ఆహారం ద్వారా సంభవించవచ్చు. దీని కారణంగా… అధిక జ్వరం, తలనొప్పి, రక్తస్రావం, కండరాల నొప్పి, చలి, కళ్ళు ఎర్రబడటం, వాంతులు కొన్ని లక్షణాలు. తీవ్రమైన సందర్భాల్లో ఛాతీ నొప్పి మరియు వాపు చేతులు, కాళ్లు కనిపిస్తాయి. లెప్టోస్పిరోసిస్‌తో మూత్రపిండాలు మరియు కాలేయం దెబ్బతినడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా మరణానికి కూడా దారితీస్తుంది. కేవలం యాంటీబయాటిక్స్ ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం ఉంటుంది.

ఇది కూడా చదవండి: Health Benefits: ఉదయం లేవగానే పచ్చి కొబ్బరి తినండి.. ఆ సమస్యలు మాయం..!