NTV Telugu Site icon

Bhagwant Mann: అమెరికా విమానం అమృత్‌సర్‌కి రావడంపై పంజాబ్ సీఎం ఆగ్రహం

Bhagwantmann

Bhagwantmann

అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను విమానాల్లో పంపించేస్తోంది. ఇప్పటికే ఒక విమాన అహ్మదాబాద్‌కు చేరుకుంది. ఇంత వరకు బాగానే ఉంది. మరికొన్ని గంటల్లో వచ్చే రెండు విమానాలపై రచ్చ రచ్చ సాగుతోంది. అమెరికా నుంచి వచ్చే రెండు విమానాలు కూడా పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ల్యాండ్ కాబోతున్నాయి. ఇక్కడే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య పంచాయితీ ముదిరింది. బహిష్కరణకు గురైన భారతీయులను తీసుకొచ్చే అమెరికా విమానాలను అమృత్‌సర్‌లో దించడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్.. కేంద్రంపై ధ్వజమెత్తారు. కావాలనే ఉద్దేశ పూర్వకంగా విమానాలు రప్పిస్తు్న్నారని మండిపడ్డారు. ఫిబ్రవరి 15, 16 తేదీల్లో వచ్చే విమానాలను అమృత్‌సర్‌లోనే దించాలన్న నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రతిష్ఠను దిగజార్చేందుకే ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి ఆరోపించారు.

ఇది కూడా చదవండి: Magic Movie: అద్దరగొట్టిన అనిరుధ్.. మ్యాజిక్ సినిమా నుంచి సూపర్ సాంగ్..

‘డిపోర్టేషన్‌’ ఆపరేషన్‌లో భాగంగా ఫిబ్రవరి 5న 104 మంది భారతీయులతో కూడిన అమెరికా సైనిక విమానం అమృత్‌సర్‌కు చేరుకుంది. మరో 119 మందితో వచ్చే విమానం ఫిబ్రవరి 15న పంజాబ్‌లోనే దిగనుంది. ఫిబ్రవరి 16న మరో విమానం కూడా పంజాబే రానుంది. శనివారం వచ్చే 119 వలసదారుల్లో 69 పంజాబ్‌, 33 మంది హర్యానా, ఎనిమిది మంది గుజరాత్‌, యూపీకి చెందిన ముగ్గురు, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్‌కు చెందినవారు ఇద్దరు చొప్పున, హిమాచల్‌ ప్రదేశ్‌, జమ్మూకశ్మీర్‌కు చెందిన వారు ఒక్కొక్కరు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ఇది కూడా చదవండి: Anji Reddy Chinnamile: నెరవేర్చలేని హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ కు ఓట్లతో బుద్ధి చెప్పాలి