Pune Man Killed His Sister In Law For Avoiding Him: అనుమానం పెనుభూతం వంటిది. అది ఒక్కసారి మనసులోకి ఎక్కితే.. క్రమంగా ప్రమాదకరంగా మారుతుంది. తాను సంతోషంగా ఉండకపోవడంతో పాటు ఇతరుల్ని సంతోషంగా ఉండనివ్వరు. ఈ అనుమానం వ్యక్తులతో నేరాలు కూడా చేయిస్తుంది. ఇప్పుడు ఓ వ్యక్తి కూడా.. అనుమానంతో తన మరదలిని అత్యంత దారుణంగా చంపేశాడు. ఆపై ఆమె ఇద్దరు పిల్లల్ని కూడా హతమార్చాడు. ఈ ఘటన మహారాష్ట్ర పుణెలోని కోంద్వాలో చోటు చేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..
Sanju Samson: సంజూ శాంసన్ దెబ్బ.. ఆల్‌టైమ్ రికార్డ్ అబ్బ
కోంద్వాలోని పిసోలి ప్రాంతంలో ఓ 25 ఏళ్ల మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటోంది. విభేదాల కారణంగా చాలాకాలం క్రితమే భర్తతో విడిపోయి, ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలోనే ఆమె తన బావకు దగ్గరైంది. వీళ్లిద్దరు శారీరకంగా కూడా కలుసుకున్నారు. ఎవ్వరికీ తెలియకుండా తమ సంబంధాన్ని గుట్టుగా కొనసాగించారు. ఇంతలో ఏమైందో ఏమో తెలీదు కానీ.. కొంతకాలం నుంచి ఆ మహిళ తన బావని దూరం పెట్టింది. ఫోన్లు, మెసేజ్‌లకు కూడా రిప్లై ఇచ్చేది కాదు. బావ మాట్లాడేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా.. పట్టించుకోకుండా వెళ్లిపోయేది. అప్పుడే అతనికి తన మరదలిపై అనుమానం వచ్చింది. ఆమె జీవితంలోకి మరో కొత్త వ్యక్తి వచ్చి ఉంటాడని, అతని సంబంధం ఏర్పరుచుకుని ఉంటుందని అనుమానించాడు.
Haryana Girl Neelam Case: ప్రేమ కోసం కెనడా నుంచి వస్తే.. దారుణంగా కాల్చి చంపాడు
ఈ అనుమానం వచ్చినప్పటి నుంచి అతడు మరింత వేధించసాగాడు. తరచూ గొడవకు దిగేవాడు. బుధవారం (ఏప్రిల్ 5) సాయంత్రం కూడా అతడు తన మరదలితో గొడవ పడ్డాడు. ఈ గొడవ తీవ్రం కావడంతో ఆగ్రహానికి గురైన అతగాడు.. ఆమెను గొంతు నులిమి చంపేశాడు. ఇదంతా చూసి ఆమె ఇద్దరు పిల్లల్ని కూడా చంపేశాడు. అనంతరం.. బెడ్‌షీట్లు, చెక్కలు వేసి వారి మృతదేహాలకు నిప్పంటించాడు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో.. పోలీసులు రంగంలోకి దిగి, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.